మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఆర్సీ15’. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా నెక్ట్స్ షెడ్యూల్ పై అప్డేట్ అందింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) క్రేజ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మరింత పెరిగింది. పాన్ ఇండియా హీరోల జాబితాలో చేరిపోయాడు చరణ్. దీంతో తన అప్ కమింగ్ ఫిల్మ్స్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. RRR తర్వాత రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీ ‘ఆర్సీ15’పై ఫోకస్ పెట్టారు. ఈ చిత్రాన్ని క్రియేటివ్ దర్శకుడు ఎస్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ను ప్రస్తుతం శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ తాజాగా మరో షెడ్యూల్ ను ఖరారు చేసినట్టు సమాచారం.
గత నెలలో పంజాబ్ లో అమ్రుత్ సర్ లో చిన్నపాటి షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఆ తర్వాత షెడ్యూల్ ను మేనెల మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ అక్కడే షూట్ ను కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్ తర్వాత ‘ఆర్సీ 15’ యూనిట్ నెక్ట్స్ షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఆ తర్వాత లక్నోలో.. మళ్లీ తిరిగి ఏపీలో రాజమండ్రిలో షూటింగ్ కు రంగం సిద్ధం చేశారంట. హైదరాబాద్ లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. గతేడాది సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రం కరోనా వల్ల కాస్తా ఆలస్యమైంది. ఏదేమైనా ఒక్కో షెడ్యూల్ ను పూర్తిచేస్తూ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేస్తోంది చిత్ర యూనిట్.
రూ.170 కోట్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోహీరోయిన్లుగా రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ (Kiara Advani) నటిస్తున్నారు. పలు కీలక పాత్రలను హీరోయిన్ అంజలి, జయరాం, సునిల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర పోషిస్తున్నారు. అలాగే ఎస్ జే సూర్య కూడా మరో క్రూషియల్ రోల్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరియు శీరిష్ నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
