సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు రామ్ చరణ్. శంకర్ చేత పరుగులు పెట్టిస్తున్నాడు. ఇక ప్రస్తుతం సినిమాకే హైలెట్ గా నిలిచే కీలక షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం.
సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఇప్పుడు 15వ సినిమాకి సంబంధించిన షూటింగులో సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. శంకర్ సినిమా షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. మొన్నటి వరకూ అవుడ్ డోర్ షూటింగ్ కోసం ఆంధ్రా ప్రాంతాలలో షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది టీమ్. ఇక ఇప్పుడు కంప్లీట్ గా హైదరాబాద్ లో పాగా వేశారు టీమ్. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక్కడ వేసిన భారీ సెట్స్ లో కీల సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమా కోసం ఎక్కడా తగ్గడం లేదు నిర్మాత దిల్ రాజు. మూవీ కోసం భారీ బడ్జెట్ ను కేటాయించాడు అంతే కాదు సెట్స్ కోసం కూడా భారీ మొత్తంలోనే ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్ సినిమా మొత్తానికి చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం 8వ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ షూటింగ్ కు సంబంధించిన షెడ్యూల్లో పాల్గొనడానికి కియారా కూడా ముంబయ్ నుంచి వచ్చేసింది. ఇక ఈసినిమాకు సంబంధించి ఇక్కడ భారీ యాక్షన్ సీన్ ఒకటి ప్లాన్ చేశారట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. సినిమాలో చాలా ముఖ్యమైన సందర్భంలో ఈ ఫైట్ వస్తుందని సమాచారం.
ఇంతవరకూ తన సినిమాలో చూడని ఒక భారా ఫైట్ ను శంకర్ ఈ సినిమాలో చూపించనున్నాడని చెబుతున్నారు. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ ఖార్చుతో భారీ సీన్ ను షూటింగ్ చేయబోతున్నారు. ఈ ఫైట్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక రేంజ్ లో ఉండనున్నట్టు సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేయడాని ప్లాన్ చేస్తున్నారు.
