బీహార్ నేపధ్యంలో ఈ కథ జరుగుతుందని..తన అన్నయ్యను చంపిన వారిని వెతుక్కుంటూ రామ్ చరణ్ బీహార్ వెళతాడని, అక్కడ జరిగే ఫైట్స్ ఈ సినిమాకు ప్రత్యేకంగా నిలుస్తాయని చెప్తున్నారు. బీహార్ నుంచి వచ్చిన క్రిమినల్స్ ఎలా ఉంటారో మనం రోజూ చదువుతూంటాం...వింటూంటం..దాన్నే ఈ సినిమాలో ప్లే చేసాడని చెప్తున్నారు. 

ఇక  ఈ సినిమా టాకీ భాగం షూట్ పూర్తయిందని చిత్ర యూనిట్ ట్విట్టర్‌లో పేర్కొంది . ఈషా గుప్తాతో ప్రత్యేక పాటతో సహా రెండు పాటలు మిగిలి ఉన్నాయని, మొత్తం షూటింగ్ డిసెంబర్ 26 నాటికి పూర్తి అవుతుందని తెలిపింది. 

డిసెంబర్ 17న సాయంత్రం 4 గంటలకు ఈ చిత్రం రెండో సింగిల్‌ ‘తస్సాదియ్యా’ను విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘తందానే తందానే’కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుక డిసెంబర్ 24న లేదా 27వ తేదీన జరగనుంది.

డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా  లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అళాగే  మాజీ హీరోలు  ప్రశాంత్‌, ఆర్యన్ రాజేష్‌ కీలక పాత్రల్లో నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్  పాత్రలో కనిపించనున్నాడు.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.