చెర్రీ వాచ్ ఎంతో తెలిస్తే.. షాకే!

ram charan's expensive watch
Highlights

పాటక్ ఫిలిప్పీ బ్రాను అయిన ఈ వాచ్ మిగిలిన వాటితో పోలిస్తే చాలా ఖరీదని చెబుతారు. ఇప్పటివరకు పది లక్షలు, ఇరవై లక్షలు ఖరీదైన వాచ్ లను పెట్టుకున్న హీరోలను చూశాం  కానీ మరీ కోటి రూపాయలకు దగ్గరున్న వాచ్ ను పెట్టుకున్న చరణ్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బయట ఈవెంట్స్ లో ఎక్కడ కనిపించినా చాలా సింపుల్ గా వస్తుంటారు. తన ఫ్యామిలీ ఈవెంట్స్ కు కూడా ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా కనిపిస్తుంటారు. ఈ మధ్యన రామ్ చరణ్ తన సతీమణితో కలిసి జీవీకే మనవరాలు శ్రియా భూపాల్ పెళ్ళికి హాజరయ్యారు. ఆ వేడుకకు అందరి మాదిరి రెడీ అయి వచ్చినప్పటికీ చరణ్ మాత్రం ఆ వేడుకలో హాట్ టాపిక్ గా మారారు. సింపుల్ గా డ్రెస్ చేసుకున్నప్పటికీ చరణ్ పెట్టుకున్న చేతి గడియారం అందరినీ ఆకర్షించింది.

టాలీవుడ్ లో చాలా మంది తారలు ఖరీదైన వాచ్ లు పెట్టుకుంటారు. తారక్ కు వాచ్ లంటే చాలా ఇష్టం. అతడి దగ్గర మార్కెట్ లో ఉన్న ఖరీదైన వాచ్ కలెక్షన్ చాలానే ఉంది. మరికొందరు హీరోలు కూడా వాచ్ ల విషయంలో ప్రత్యేకత చూపిస్తుంటారు. అయితే చరణ్ మాత్రం వారందరికీ ల్యాండ్ మార్క్ సెట్ చేశాడు. శ్రియా భూపాల్ పెళ్లిలో చరణ్ పెట్టుకున్న వాచ్ ఖరీదు అక్షరాల రూ.80 లక్షలు.

పాటక్ ఫిలిప్పీ బ్రాను అయిన ఈ వాచ్ మిగిలిన వాటితో పోలిస్తే చాలా ఖరీదని చెబుతారు. ఇప్పటివరకు పది లక్షలు, ఇరవై లక్షలు ఖరీదైన వాచ్ లను పెట్టుకున్న హీరోలను చూశాం  కానీ మరీ కోటి రూపాయలకు దగ్గరున్న వాచ్ ను పెట్టుకున్న చరణ్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం చరణ్.. దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందిస్తోన్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా పూర్తయిన తరువాత రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ లో నటించనున్నాడు.  

loader