శుక్రవారం రోజు ఏప్రిల్ 28న ఏజెంట్ చిత్రం రిలీజ్ అవుతుండడంతో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ చిత్ర హైప్ రెట్టింపు అయ్యేలా ఏజెంట్ టీం షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. 

అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అఖిల్ కోరుకునే యాక్షన్ బ్లాక్ బస్టర్ ఇంతవరకు దక్కలేదు. ఆ కోరిక సురేందర్ రెడ్డి ద్వారా తీరుతుంది అని అఖిల్ బోలెడు ఆశలతో ఉన్నాడు. శుక్రవారం రోజు ఏప్రిల్ 28న ఏజెంట్ చిత్రం రిలీజ్ అవుతుండడంతో ఉత్కంఠ పెరిగిపోతోంది. 

ఈ చిత్ర హైప్ రెట్టింపు అయ్యేలా ఏజెంట్ టీం షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ గెస్ట్ రోల్ పోషిస్తున్నట్లు అర్థం వచ్చేలా చిన్న టీజర్ రిలీజ్ చేశారు. ఏజెంట్ ని.. ధృవ మీట్ అవబోతున్నట్లు టీజర్ లో చూపించారు. టీజర్ లో పవర్ ఫుల్ గా ధృవ బిజియం వస్తుంది. వెనుక నుంచి రాంచరణ్ ని చూపించారు. చివర్లో ఏజెంట్ ఎక్కడున్నావు అంటూ రాంచరణ్ పవర్ ఫుల్ వాయిస్ వినిపిస్తోంది. 

ఈ టీజర్ ని అఖిల్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ టీజర్ కి ధృవ X ఏజెంట్.. పరిస్థితులు మరింత వైల్డ్ గా మారుతున్నాయి అని క్యాప్షన్ ఇచ్చారు. రాంచరణ్ ధృవ చిత్రానికి దర్శకుడు సురేందర్ రెడ్డే. ఆ మూవీ కూడా స్పై థ్రిల్లర్ లాగే ఉంటుంది. చూస్తుంటే లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్, వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ తరహాలో సురేందర్ రెడ్డి కూడా సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారా ? ఇది సురేందర్ రెడ్డి స్పై యూనివెర్సా ? అనే అనుమానం కలుగుతోంది. 

Scroll to load tweet…

దీనికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే అని ప్రకటించారు. బాగా హైప్ పెంచి ఇది రాంచరణ్, అఖిల్ ఇంటర్వ్యూ మాత్రమే అని ఉసూరుమనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏది ఏమైనా రాంచరణ్ ఎంట్రీ తో ఏజెంట్ హైప్ మరింత పెరిగింది అనే చెప్పాలి. 

అఖిల్ ఈ చిత్రం కోసం ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడ్డాడు. సురేందర్ రెడ్డి ఈ మూవీలో అఖిల్ లుక్ ని పూర్తిగా మార్చేశారు అనే చెప్పాలి. పాలబుగ్గలతో క్యూట్ బాయ్ లాగా కనిపిస్తూ వచ్చిన అఖిల్ కి సురేందర్ రెడ్డి వైల్డ్ టచ్ ఇచ్చారు. మరి సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి.