ప్రస్తుతం ఆచార్య షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చిరంజీవి 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటించనుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
చిరు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కరోనా వల్ల కొన్ని నెలల పాటు బ్రేక్ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ షూటింగ్ మొదలైపోయింది. చిరంజీవి లేకుండా కొన్ని సీన్స్ ప్లాన్ చేసి తీసారు శివ. ఇప్పుడు చిరు సైతం ఈ సినిమా షూటింగ్ కు హాజరవుతున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర గురించిన వార్తలు మీడియాలో మరోసారి గుప్పుమన్నాయి.
మొదట ఈ చిత్రంలో దాదాపు 30 నిమిషాల నిడివిగల గెస్ట్ రోల్ ఉందని, అందులో మహేశ్‌బాబు నటించబోతున్నారని ప్రచారం జరిగింది. ఫస్ట్ ఒప్పుకున్న ఆయన, కొన్ని కారణాల వల్ల తర్వాత తప్పుకున్నట్లు తెలిసింది. ఆ పాత్రను చెర్రీ పోషించబోతున్నారు. అయితే ఇన్నాళ్లపాటు చరణ్ చేయబోయేది కేవలం గెస్ట్ రోల్ మాత్రమేనని, కొద్దిసేపే స్క్రీన్ మీద కనిపిస్తారని అనుకుంటూ వచ్చారు. కానీ రామ్ చరణ్ ఇందులో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నట్టు కొరటాల శివ స్పష్టం చేసారు. పాత్ర నిడివి ఏంతనేది తెలియలేదు కానీ సినిమాలో చాలా సేపు ఉంటుందని మాత్రం చెప్తున్నారు. అయితే ఇక్కడే ఓ డౌట్ అందరికీ వస్తోంది. రామ్ చరణ్ పాత్ర గెస్ట్ కాదని తేల్చిన కొరటాల శివ..కేవలం నెల లోపే రామ్ చరణ్ డేట్స్ తీసుకోవటం ఏమిటి..మరిన్ని రోజులు అవసరం అవుతాయి కదా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
మరో ప్రక్క రామ్ చరణ్‌కు జోడీగా నటించబోయేది ఎవరన్నది మాత్రం చిత్ర టీమ్ ఇంకా స్పష్టం చేయలేదు. గతంలో కన్నడ భామ రష్మిక, సమంత, సాయిపల్లవి ఇలా.. కొన్ని పేర్లు వినిపిస్తూ వచ్చాయి. అయితే.. చిత్ర టీమ్ మాత్రం బాలీవుడ్‌వైపు మొగ్గు చూపించిందట. చరణ్‌కు జోడీగా ఓ బాలీవుడ్ భామను తీసుకొస్తే బాగుంటుందని భావిస్తోందని తెలుస్తోంది. అంతేకాదు.. ఇప్పటికే కొంతమంది హీరోయిన్లతో ఓ లిస్టు తయారు చేసి.. చివరికి కియారా అడ్వాణీని ఎంపిక చేసినట్లు సమాచారం.
రామ్ చరణ్ మాట్లాడుతూ...‘స్టార్‌డమ్, ప్రేక్షకుల అభిమానం.. ఇవన్నీ మా నాన్న వల్ల నాకు వచ్చినవే. అలాంటి ఆయనతో కలిసి వెండితెరను పంచుకోవడం నా అదృష్టం. 2015లో నేను నటించిన ‘బ్రూస్‌లీ’ చిత్రంలో నాన్న ప్రత్యేక పాత్రలో నటించారు. అదేవిధంగా ‘ఖైదీ నెంబర్ 150’లోని పాటలో నేను నాన్నతో కలిసి స్టెప్పులేశా. ఇప్పుడు ‘ఆచార్య’లో మళ్లీ కలిసి తెరపై కనిపిస్తాం’ అని ఆయన చెప్పారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 15, 2020, 12:32 PM IST