మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డే సందడి షురూ అయ్యింది. రేపు(ఆగస్ట్ 22)న చిరంజీవి బర్త్ డే అనే విషయం తెలిసిందే. ఈ సారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చిరు బర్త్ వేడుకలకు అంతరాయం ఏర్పడింది. అయినా ఆన్‌లైన్‌లో ద్వారా వేడుకల్లో అభిమానులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. 

దీనిలో వేలల్లో అభిమానులు పాల్గొనేలా ఏర్పాటు చేశారు. అయితే చిరు బర్త్ డే సంబరాలు ఈ సాయంత్రం నుంచే ప్రారంభమయ్యాయి. సాయంత్ర ఆరు గంటల నుంచి ఆన్‌లైన్‌ సంబరాలు ప్రారంభమయ్యాయి. మొదటగా చిరంజీవి బర్త్ డే సీడీపీని రామ్‌చరణ్‌ లాంచ్‌ చేయడంతో ఈ వేడుక షురూ అయ్యింది. ఆరు గంటలకు ప్రారంభయ్యే ఈ వేడుక ఉదయం వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇక చరణ్‌ లాంచ్‌ చేసిన సీడీపీలో చిరు కెరీర్ ప్రారంభం నుంచి `సైరా నరసింహారెడ్డి` వరకు ఆయన కెరీర్‌లోని మైలు రాయిలాంటి సినిమాల్లోని ఆయన గెటప్ లను చూపిస్తూ పోస్టర్‌ని డిజైన్‌ చేశారు. ఇది విశేషంగా ఆకట్టుకుంటుంది.

బర్త్ డే వేడుకలకు సంబంధించి ఓ షెడ్యూల్‌ పోస్టర్‌ని పంచుకున్నారు. ఇందులో ఏడు గంటలకు ఎనబై మంది సెలబ్రిటీలు కామన్‌ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేయబోతున్నారు. అలాగే ఎనిమిది గంటలకు నాగబాబు బర్త్ డే విశెష్‌ తెలియజేస్తారు. తొమ్మిది గంటలకు సాయితేజ్‌ తన విశెష్‌ తెలియజేస్తారు. పది గంటలకు అఖిల భారత చిరంజీవి యువత కార్యక్రమం ఉంటుంది. పదిన్నరకు చిరంజీవికి సంబంధించి తెలియని విషయాలు పంచుకుంటారు. పదకొండు గంటలకు ఇప్పటి వరకు చూడని చిరు ఫోటోలను విడుదల చేస్తారు. పన్నెండు గంటలకు చిరంజీవికి బర్త్ డే విశెష్‌ తెలియజేస్తారు. 

రేపటికి సంబంధించిన షెడ్యూల్‌ని కూడా ఇందులో వెల్లడించారు. ఉదయం ఎనిమిది గంటలకు అల్లు అర్జున్‌.. చిరుకి బర్త్ డే విశెష్‌ తెలియజేయడంతో మళ్ళీ వేడుకలు షురూ కానున్నాయి. ఆ తర్వాత గంట గంటకు వరుణ్‌ తేజ్‌, సుష్మితా, అల్లు శిరీష్‌, నిహారిక, కళ్యాణ్‌ దేవ్‌ విశెష్‌లు తెలియజేస్తారు.