Asianet News TeluguAsianet News Telugu

`షూట్‌ అవుట్‌ ఎట్‌ ఆలేరు` అంటూ గన్‌తో హల్‌చల్‌ చేసిన రామ్‌చరణ్‌

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ గన్‌తో హల్‌చల్‌ చేశారు. మీడియా ముందే తుపాకీ పట్టుకుని కాల్చబోయాడు. ప్రస్తుతం ఆయన గన్‌ పట్టుకుని హంగామా చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ram charan release shoot out at alair web series show reel  arj
Author
Hyderabad, First Published Dec 22, 2020, 7:13 PM IST

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ గన్‌తో హల్‌చల్‌ చేశారు. మీడియా ముందే తుపాకీ పట్టుకుని కాల్చబోయాడు. ప్రస్తుతం ఆయన గన్‌ పట్టుకుని హంగామా చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. మరి ఇంతకి రామ్‌చరణ్‌ అలా ఎందుకు చేశాడు, ఆయన వద్ద గన్‌ ఎక్కడిది అనేది చూస్తే..మెగాస్టార్‌ చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణు ప్రసాద్‌ కలిసి  `షూట్‌ అవుట్‌ ఎట్‌ ఆలేరు` అనే వెబ్‌ సిరీస్‌ ని గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్‌మెంట్స్` సంస్థపై నిర్మిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్‌ డ్రామా సిరీస్‌గా ఇది రూపొందుతుంది.  మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయని 'జీ 5' వర్గాలు వెల్లడించాయి.

 

ఇది ఈ నెల 25న క్రిస్మస్‌ కానుకగా జీ5 ఓటీటీలో విడుదలవుతుంది. ఇందులో ప్రకాష్‌రాజ్‌, శ్రీకాంత్‌, నందిని రాయ్‌, తేజా కాకుమాను నటిస్తున్నారు. దీనికి ఆనంద్‌ రంగా దర్శకత్వం వహించారు. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తన సోదరి సుష్మిత కోసం అతిథిగా పాల్గొన్నాడు రామ్‌చరణ్‌. ఆయన సిరీస్‌ షోరీల్‌ విడుదల చేశారు.  ఈ సందర్భంగా సినిమాలో ఉన్నట్టుగా గన్‌ పట్టుకుని హంగామా చేశారు చరణ్‌. 

షోరీల్ విడుదల కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ, `జీ 5 ఓటీటీకి హెడ్ గా మాత్రమే కాకుండా... మా అక్క సుష్మిత, బావ విష్ణుకి మెంటార్ గా ఉన్న ప్రసాద్ నిమ్మకాయల గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. ఆనంద్ రంగా దర్శకత్వం వహించిన 'ఓయ్' నేను చూశా. జిమ్ కి వెళుతూ ఎన్నో నెలలు ఆ సినిమాలో పాటలు కారులో వింటూ ఉండేవాడిని. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. ఆనంద్ రంగా సినిమాలు మిస్ అవుతున్నాను. మా అక్క, బావ (సుష్మిత - విష్ణుప్రసాద్)తో అసోసియేట్ అయి ఓటీటీ వేదిక కోసం ఆయన సిరీస్ చేయడం... కమ్ బ్యాక్ లో అక్కాబావకి సపోర్ట్ చేయడం హ్యాపీగా ఉంది 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' షోరీల్ ఫెంటాస్టిక్ గా ఉంది. చాలా రియల్ గా కూడా ఉంది. నటన విషయంలో, రియలిస్టిక్ లుక్ విషయంలో... నటీనటులు అందరూ బెస్ట్ ఇచ్చారు. 

మనం ఏదైతే కోరుకుంటున్నామో, అలాంటి ప్రాజెక్ట్‌ ఇది.  ప్లాస్టిక్ ఎరా ఆఫ్ ఫిలింమేకింగ్ అయిపొయింది. తేజ, నందినిరాయ్ కాంబో అదిరిపోయింది. కరోనా మహమ్మారి కాలంలో 'షూట్ అవుట్ ఎట్ ఆలేరు' టీమ్ అంతా బయటకు వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మనందరికీ ఈ ఏడాది చాలా కష్టంగా గడిచింది. ఎప్పటికీ మరువలేం. ఈ ఏడాది నుండి చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు చిత్ర పరిశ్రమ మళ్లీ తన కాళ్ల మీద నిలబడింది. ఎలా మొదలైందని అనేది కాదు... ఏడాది ఎలా ముగిసిందనేది చాలా అంటే చాలా ముఖ్యం అని అన్నారు. 

సుష్మితా కొణిదెల గురించి చరణ్‌ చెబుతూ, నాన్నగారు 79లో ఇండస్ట్రీలో ప్రయాణం ప్రారంభించినప్పటి నుండి మా కుటుంబం ఎన్నో ప్రయోగాలు, కొత్త ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. మేమంతా కష్టపడుతున్నామని గర్వంగా చెప్పగలను. ఇటువంటి కొత్త (ఓటీటీ) విభాగంలో సుష్మిత ఫైటర్ అని చెప్పవచ్చు. 'రంగస్థలం'కి అక్క స్టయిలిస్ట్ గా పని చేసింది. నా ఫస్ట్ ప్రొడక్షన్ 'ఖైదీ నంబర్ 150'కి కూడా పని చేసింది, బయటవాళ్ళు అయితే తిట్టించుకుని పని చేయించుకుంటాం. ఇంట్లోవాళ్లను తిట్టలేం. నాన్నగారు నన్ను తిట్టేవారు. పర్లేదు. నేను ఎవరినైనా కసురుకోవాలన్నా, ఏమైనా కోపం చూపించాలన్నా హానీ అక్క (సుష్మిత) మీద చూపించేవాడిని. నా బిగ్గెస్ట్ సపోర్ట్ తనే. ఈ సిరీస్ తో తను తప్పకుండా సక్సెస్ అందుకుంటుందన్నారు. 

దర్శకుడు ఆనంద్ రంగా మాట్లాడుతూ, చరణ్‌కి థ్యాంక్స్ చెప్పారు. సుష్మితా కొణిదెల మాట్లాడుతూ, ఈ 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' ప్రాజెక్ట్ కి మాత్రమే కాదు..నా జీవితంలో ముఖ్యమైన సందర్భాలు, విషయాల్లో చరణ్ ఎప్పుడూ నాకు అండగా, నావైపు నిలబడి ఉన్నాడు. తన విషయంలో నేనెంతో గర్వంగా, సంతోషంగా ఉన్నాను. అవకాశాలు, అదృష్టం తలుపు తట్టినప్పుడు మనం రెడీగా ఉండాలని అంటారు. అలా కాకుండా మనమే ముందుకు వెళ్లి అవకాశాల కోసం చూడాలనీ... అవి వచ్చినప్పుడు మనం తీసుకోవాలని నాన్నగారు చెబుతుంటారు. అటువంటి స్ఫూర్తి ఇవ్వడంతో పాటు కొండంత అండగా నిలబడిన నాన్నగారికి ధన్యవాదాలు. 

Follow Us:
Download App:
  • android
  • ios