రామ్ చరణ్ ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్‌లో ఉన్నారు. త్వరలో మరో సినిమా ప్రారంభం కానుంది. లేటెస్ట్ ఇంకో సినిమాకి కమిట్ అయ్యాడు. ఆ వివరాలు వైరల్ అవుతున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కొత్త సినిమా ఫిక్స్ అయ్యింది. ఆయన ఆ స్టార్ డైరెక్టర్‌తో మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. ఇదే ఇప్పుడు వైరల్‌గా మారింది. రామ్ చరణ్ ప్రస్తుతం `గేమ్ ఛేంజర్` షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. వైజాగ్‌లో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. వైజాగ్ బీచ్‌లో ఒక పొలిటికల్ సీన్‌కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రభుత్వ అధికారిగా స్టేజ్‌పై కనిపించారు రామ్‌చరణ్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీని ఈ ఏడాది ఎండింగ్‌లో ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారట.
మరోవైపు తన నెక్ట్స్ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. ఆయన `ఆర్‌సీ16`పేరుతో బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీకి `పెద్ది` అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రనేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయ్ సేతుపతి కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. దీన్ని ఈ నెల 20న ప్రారంభించబోతున్నారు.
ఇక మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. రామ్‌చరణ్ మరో కొత్త సినిమా ఫైనల్ అయ్యిందట. `ఆర్‌సీ17` కూడా ఓకే అయ్యిందంటున్నారు. బుచ్చిబాబు తర్వాత సినిమాని సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నారట. రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని, గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఫైనల్ అయ్యిందని తెలుస్తుంది. ఇది `పుష్ప2` రిలీజ్ తర్వాత ప్రారంభమవుతుందని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు.
ఓ రకంగా ఇది మరో `రంగస్థలం` కాబోతుందని చెప్పొచ్చు. గతంలో రామ్‌చరణ్, సుకుమార్, మైత్రీ, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో `రంగస్థలం` సినిమా వచ్చింది. నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. అప్పట్లోనే రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. రామ్‌చరణ్ రేంజ్‌ని మార్చేసింది. నటుడిగా ఆయన్ని కొత్తగా ఆవిష్కరించింది. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించింది. పూజా హెగ్డే ఐటెమ్ సాంగ్ చేసింది. `జిగేల్ రాణి` పాట ఎంతగా ఉర్రూతలూగించిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రాబోతున్న నేపథ్యంలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. దీంతోపాటు సంజయ్ లీలా భన్సాలీతో రామ్ చరణ్ ఓ మూవీ చేయబోతున్నారు.
