మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - క్రియేటివ్ దర్శకుడు ఎస్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ‘ఆర్సీ15’ మళ్లీ షూటింగ్ సిద్ధమవుతోంది. తాజాగా నెక్ట్స్ షెడ్యూల్ పై క్రేజీ బజ్ వినిపిస్తోంది.   

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న పొలిటికల్ అండ్ యాక్షన్ ఫిల్మ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘ఆర్సీ15’ వర్క్ టైటిల్ తో చిత్ర షూటింగ్ ను కొనసాగించారు. ఇటవల డైరెక్టర్ శంకర్ ‘ఇండియన్ 2’ చిత్రం కోసం ఈ మూవీ పనులను ఆపిన విషయం తెలిసిందే. దీంతో మళ్లీ ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందోననే సందేహం అందరిలో ఉండింది. ఈ క్రమంలో తాజాగా Rc15 షూటింగ్ పైనా క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. ఇన్నాళ్లు టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లను నిలిపేయగా..సెప్టెంబర్ 2 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు స్టార్ ప్రొడ్యూసర్ కూడా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 

దీంతో ‘ఆర్సీ15’ షూటింగ్ ను కూడా తిరిగి ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. అది కూడా సెప్టెంబర్ 2 నుంచే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలా షెడ్యూళ్లను పూర్తి చేయగా.. నెక్ట్స్ షెడ్యూల్ ను సెప్టెంబర్ లో మొదలెట్టనున్నారు. మరో రెండు, మూడు షెడ్యూళ్లలో చిత్రాన్ని పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం షెడ్యూల్ తో సినిమా తొంబై శాతం మేర పూర్తి కావస్తుందని ప్రచారం జరుగుతోంది. దీంతో చెర్రీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే శంకర్ అటు ‘ఇండియన్ 2’ సినిమాను పట్టాలెక్కించినందున.. రెండు చిత్రాలను సమాంతరంగా తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. కేవలం రామ్ చరణ్ లుక్ ను రిలీజ్ చేశారంతే. ఆ తర్వాత ఏ అప్డేట్ రాలేదు. దీంతో త్వరలోనే ‘ఆర్సీ’15 నుంచి ఫస్ట్ లుక్ లేదా టీజర్, మరోవైపు టైటిల్ అనౌన్స్ చేయనున్నారనే సమాచారం అందుతోంది. ఇప్పటికే టైటిల్ విషయంలో ‘సర్కారోడు’,‘అధికారి’ ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ - కియారా అద్వానీ (Kiara Advani) జంటగా నటిస్తున్నారు. దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ పై నిర్మిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, సునీల్, ప్రకాష్ రాజ్ ఆయా పాత్రల్లో కనిపించనున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.