ఐఎండీబీ(ది ఇంటర్నెట్‌ మూవీడేటాబేస్‌) సంస్థ తాజాగా ఇండియన్‌ మోస్ట్ పాపులర్‌ స్టార్స్ లిస్ట్ ని ప్రకటించింది. ఇందులో తెలుగు హీరోలు వెనకబడి పోగా, ఉన్న వారిలో రామ్‌చరణ్‌, సమంత ముందు వరుసలో ఉండటం విశేషం. 

ఏడాది పూర్తవుతుందంటే స్టార్‌ హీరోల పాపులారిటీ, క్రేజ్‌ తరచూ హాట్‌ టాపిక్‌. అభిమానుల్లో ఈ చర్చ ఎక్కువగా జరుగుతుంటుంది. తాజాగా 2022ఏడాదికిగానూ పాపులార్‌ స్టార్స్ జాబితా వెల్లడైంది. ఇండియన్‌ పాపులర్‌ సంస్థ అయిన ఐఎండీబీ(ది ఇంటర్నెట్‌ మూవీడేటాబేస్‌) సంస్థ తాజాగా ఇండియన్‌ మోస్ట్ పాపులర్‌ స్టార్స్ లిస్ట్ ని ప్రకటించింది. ఇందులో తెలుగు హీరోలు వెనకబడి పోగా, ఉన్న వారిలో రామ్‌చరణ్‌, సమంత ముందు వరుసలో ఉండటం విశేషం. 

ఇందులో మొదటి స్థానంలో ధనుష్‌ నిలవడం విశేషం. రెండో స్థానంలో `ఆర్ఆర్ఆర్‌` బ్యూటీ అలియాభట్‌, మూడో స్థానంలో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్‌ నిలిచారు. నాల్గో స్థానంలో `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌ రామ్‌చరణ్‌ దక్కించుకున్నారు. ఐదో స్థానంలో సమంత నిలవడం విశేషం. ఆరో స్థానంలో హృతిక్‌ రోషన్‌, ఏడో స్థానంలో కియారా అద్వానీ నిలవగా, ఎనిమిదో స్థానాన్ని ఎన్టీఆర్‌, తొమ్మిదో స్థానాన్ని అల్లు అర్జున్‌ దక్కించుకున్నారు. `కేజీఎఫ్‌` స్టార్‌ యష్‌ పదో స్థానానికే పరిమితమయ్యాయి. ఈ ఏడాది తమ సినిమాలతో ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసిన స్టార్స్ చివర్లో నిలవడం గమనార్హం. 

ఇదిలా ఉంటే ఇందులో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌ పేర్లు లేకపోవడం గమనార్హం. అలాగే తమిళం నుంచి విజయ్‌, సూర్య వంటి పేరు కూడా ఈ జాబితాలో లేకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. అయితే బాలీవుడ్‌ నుంచి ఒక్క హృతిక్‌ పేరే ఉండటం మరింత షాక్‌కి గురి చేస్తుంది. ఒకప్పుడు అంతా బాలీవుడ్‌ స్టార్సే ఇందులో నిలిచే వారు. బిగ్‌ స్టార్స్ పేర్లు ఎవరివి కూడా ఇందులో లేకపోవడంతో బాలీవుడ్‌ స్టార్స్ క్రేజ్‌ తగ్గిపోతుందనడానికి నిదర్శనమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

Scroll to load tweet…

మొదటి స్థానం దక్కించుకున్న ధనుష్‌ ఈ ఏడాది ఇంటర్నేషనల్‌ మూవీ `ది గ్రే మ్యాన్‌`లో మెరిశారు. అలాగే `మారన్‌`తోనూ అలరించారు. మరోవైపు `ఆర్‌ఆర్‌ఆర్‌`, `గంగూబాయి కథియవాడి` చిత్రాలతో ఆకట్టుకున్న అలియాభట్‌ ఇండియా వైడ్‌గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. `పుష్ప2`తో బన్నీ పేరు ఇంకా మారుమోగుతూనే ఉంది. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు రచ్చ చేశారు. `కేజీఎఫ్‌2` యష్‌ దుమ్ము దుమారం రేపారు. ఓ వైపు విడాకులు విషయంతో, మరోవైపు అనారోగ్యంతో, `యశోద` మూవీతో తరచూ సమంత వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అలాగే `పొన్నియిన్‌సెల్వన్‌`తో ఐశ్వర్యా రాయ్‌ అలరించింది.