Asianet News TeluguAsianet News Telugu

రీ రిలీజ్ కు రెడీ అవుతున్న రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా, మరి మగధీర రిలీజ్ ఏమైనట్టు..?

ఈమధ్య కాలంలో రీరిలీజ్ ల ట్రెండ్ ఎక్కువైపోయింది. స్టార్ హీరోల బర్త్ డేల సందర్బంగా వారి లాండ్  మార్క్ మూవీస్ నుసెలక్ట్ చేసుకుని, రీ రిలీజ్ చేయడం స్టార్ చేశారు. ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయ్యి.. మంచి రెస్పాన్స్ సాధించాయి. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆరేంజ్ మూవీ కూడా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. 

Ram Charan Orange Movie Re Release For Mega Power Star Birthday
Author
First Published Mar 18, 2023, 11:15 AM IST

రామ్ చరణ్ కెరీర్ లో మర్చిపోలేని సినిమా ఆరేంజ్. దాని రిజల్ట్ పక్కన పెడితే సినిమా యూత్ ను గట్టిగా ఆకర్శించింది. పదమూడేళ్ల క్రితం వచ్చిన ఈసినిమా.. అడ్వాన్స్ గా లవ్ ట్రెండ్ ను గురించి పక్కాగా ఇన్ ఫర్మేషన్ ఇచ్చింది. ఇకఆరేంజ్ పాటలయితే చెప్పాల్సిన అవసరమే లేదు. హరీస్ జయరాజ్ మ్యూజిక్ ఒక ఊపు ఊపేసింది. ఒకటి రెండు అని కాదు..ఆరెంజ్ సినిమాలో పాటలన్నీ సంచలనం సృష్టించాయి. ప్రతీ ప్రేమికుడి మదిలో వికసించాయి. ఎక్కడ చూసినా.. అవే పాటలు వినిపించాయి. ఇప్పటికీ యూత్ పార్టీస్ లో ఆరెంజ్ పాట పక్కాగా వినిపిస్తుంది. అంతలా మైమరపింపచేశాయి. 

ఇక మగధీరా లాంటి భారీ సినిమా తరువాత ఇలాంటి లవ్ స్టోరీలో రామ్ చరణ్ ను చూడలేకపోయారు ఫ్యాన్స్. అందులోను పాటలు తెచ్చిన హైప్ ను సినిమా అందుకోలేకపోవడం..సినిమా చాలా మందికి సరిగ్గా అర్ధం కాకపోవడం.. స్క్రీన్ ప్లే దెబ్బకోట్టడంతో ఆరేంజ్ ప్లాప్ ను మూటగట్టుకుంది. అంత ప్లాప్ మూవీ అన్నా.. ఈసినిమా చాలా మందికి చాలా ఇష్టమైన సినిమాగా మిగిలిపోయింది. అంతెందుకు రామ్ చరణ్ కూడా తనకు ఇష్టమైన సినిమా ఏది అని అడితే ఆరెంజ్ అని టక్కున చెప్పేస్తాడు. చాలా సందర్బాల్లో ఈ మూవీపై తనకు ఉన్న ఇష్టాన్ని వెల్లడించాడు చరణ్. 

ఇక ఈమూవీ మరోసారి మెగా ఫ్యాన్స్ ను అలరించడానికి రెడీ అవుతోంది. ఈనెల 27న రామ్ చరణ్ భర్త్ డే సందర్భంగా ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఈసినిమాను ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేసి.. సినిమా ద్వారా వచ్చిన కలెక్షన్స్ ను జనసేన పార్టీ ఫండ్ గా ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు నిర్మాత సాయి రాజేష్. దీంతో మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. అసలు ఆరెంజ్ కంటే ముందుగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మగధీర సినిమాను రిలీజ్  చేయాలని చూశారు. 

అంతే కాదు మగధీర సినిమా   రిలీజ్ చేయబోతున్నట్టు గీతాఆర్ట్స్ అఫీషియల్ గా సోషల్ మీడియాలో  ప్రకటన కూడా చేశారు. కాని మగధీర ప్రింట్ లో... కొన్నిసాంకేతిక లోపాల వల్ల.. ఇలా ఆరేంజ్ ను సెలక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఆడియనస్ మాత్రం ప్రస్తుతం ఆస్కార్ సాధించిన చరణ్ , రాజమౌళికాంబినేషన్ కు సబంధించిన మగధీర ను రీరిలీజ్ చేస్తే.. బాగుండేది అని అభిప్రాయాలు వ్యాక్తం చేస్తున్నారు. ముందుగా ప్రకటించి కూడా రిలీజ్ చేయలేకపోతున్నందుకు కొందరు ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతున్నారు. 

ఇక ఆరేంజ్ సినిమా రీరిలీజ్ కు ముస్తాబు అవుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో చరణ్ జోడీగా జెనీలియా నటించి మెప్పించింది. ఈసినిమాను అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా బ్రదర్ నాగబాబు నిర్మించారు. అయితే ఈమూవీ నష్టాల వల్ల తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలి అనిపించిందని.. కాని తన తమ్ముడ పవన్ కళ్యాణ్, అన్న చిరంజీవి తనను ఆదుకున్నట్టు నాగబాబు గతంలో వెల్లడించారు. ఇక ఏది ఏమైనా.. ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ అవుతుండటంతో.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios