మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ‘ఆర్సీ16’పై అఫిషీయల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. బుచ్చిబాబు డైరెక్షన్ లో చెర్రీ నటించబోతున్నారు. అధికారికంగా ప్రకటిస్తూ.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ ను అందించారు మేకర్స్. 

‘RRR’ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. దీంతో చెర్రీ అప్ కమింగ్ ఫిల్మ్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే తమిళ ప్రముఖ దర్శకుడు ఎస్ శంకర్ డైరెక్షన్ లో చరణ్ ‘ఆర్సీ15’ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. త్వరలో ఈ చిత్రం కూడా షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకోనుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ లో షూటింగ్ కొనసాగుతోంది. అయితే ‘ఆర్సీ15’ తర్వాత నెక్ట్స్ చరణ్ ఎవరి దర్శకత్వంలో నటిస్తారనేది కొద్ది నెలలుగా చిత్ర పరిశ్రమలో ఆసక్తిగా మారింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

‘ఆర్సీ16’ను డైరెక్ట్ చేయబోతున్నారని పలువురి పేర్లు గట్టిగానే వినిపించాయి. తొలుత ‘జెర్సీ’ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి అవకాశం ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. కానీ చరణ్ పాన్ ఇండియా హీరో కావడంతో డీల్ చేయడం కష్టమని గౌతమ్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా దర్శకుడు నర్తనా మరియు బుచ్చిబాబు పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిద్దరిలో ఎవరనేది నిన్నటి వరకూ ఆసక్తికరంగా మారింది. ఈక్రమంలో కొద్దిసేపటి కింద ‘ఆర్సీ16’పై అఫిషీయల్ అనౌన్స్ మెంట్ అందింది. సెన్సేషన్ డైరెక్టర్ బుచ్చిబాబుతోనే చరణ్ నటించబోతున్నారని కన్ఫమ్ అయ్యింది.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘ఆర్సీ16’ పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకోనుంది. కథ, దర్శకత్వం బుచ్చిబాబు సానాగా స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కూడా నిర్మాణ భాగస్వామ్యం కానున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వ్యాపారవేత్త, నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 2023లో సెట్స్‌పైకి వెళ్లనుంది. త్వరలోనే నటీనటులు, చిత్ర యూనిట్ ను అఫిషీయల్ గా ప్రకటించనున్నారు. 

మూవీ ప్రారంభం పట్ల రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘బుచ్చిబాబు దర్శకత్వంలో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను. ఆయనతో మూవీని ప్రకటించడం సంతోషంగా ఉంది.’ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ‘రంగస్థలం’ చిత్రానికి బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి చరణ్ కు బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం వీరి కాంబినేషన్ సెట్ అవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఉప్పెన’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు.. ‘ఆర్సీ16’ను ఎలా ప్రజెంట్ చేయబోతున్నారనేది మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ పాన్ ఇండియా చిత్రానికి సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ లేదా దేవి శ్రీ ప్రసాద్‌ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Scroll to load tweet…

Scroll to load tweet…