మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు క్రేజీ అప్డేట్ తో రానున్నాడు. ఫ్యాన్స్ కోసం ఆయన తన తదుపరి చిత్ర ప్రకటన సిద్ధం చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా, కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. అలాగే దర్శకుడు కొరటాల శివ, చిరంజీవితో చేస్తున్న ఆచార్య షూటింగ్ కూడా ప్రోగ్రెస్ లో ఉంది. 


ఆచార్య మూవీలో రామ్ చరణ్ నిడివి కలిగిన కీలక పాత్ర చేస్తున్నారు. ఆచార్యలో చరణ్ ప్రీ లుక్ తో పాటు సిద్దా అంటూ క్యారెక్టర్ నేమ్ కూడా రివీల్ చేయడం జరిగింది. ఈ రెండు చిత్రాలు మినహా కొత్త మూవీ ప్రకటన రామ్ చరణ్ ఇంత వరకు చేయలేదు. రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ దర్శకులంటూ కొందరు యంగ్ అండ్ సీనియర్ డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి. 


లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వస్తున్నా అన్నట్టు, రామ్ చరణ్ ఏకంగా దర్శకుడు శంకర్ తో మూవీ సెట్ చేశారు. దిల్ రాజు నిర్మాతగా, శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ మూవీకి సర్వం సిద్ధం అయ్యింది. నేడు సాయంత్రం 5:15 నిమిషాలకు చిత్ర యూనిట్ దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. దీనితో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. భారీ చిత్రాల దర్శకుడిగా పేరున్న శంకర్ ఈ మూవీని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించనున్నారు. మరి ఈ మూవీ జోనర్, నటీనటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి వుంది.