ప్రస్తుతం `వకీల్‌సాబ్‌` ఎవరు అంటూ పవన్‌ కళ్యాణ్‌ పేరు గుర్తొస్తుంది. ఆయన `వకీల్‌సాబ్‌` చిత్రంలో నటించడం, పైగా అందులో ఆయన లాయర్‌ గెటప్‌లో కనిపించడంతో ప్రస్తుతానికి వకీల్‌సాబ్‌ గా మారిపోయారు పవన్‌. ఇక అలాగే రామ్‌చరణ్‌..`అల్లూరి సీతారామరాజు`గా మారిపోయారు. ఆయన `ఆర్‌ ఆర్‌ఆర్‌` చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. బాబాయ్‌ పవన్‌, అబ్బాయి చరణ్‌ కలిశారు. 

సంక్రాంతి పండుగని పురస్కరించుకుని రామ్‌చరణ్‌..పవన్‌ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కరోనా ప్రభావం, ఇటీవల చరణ్‌కి కరోనా సోకడం వంటి కారణంగా చాలా రోజులుగా వీరు కలుసుకోలేదు. పైగా పండుగల సమయంలో వీరు కలుసుకునే సాంప్రదాయం ఉంది. దీనికితోడు పవన్‌కి, చెర్రీకి మధ్య మరింత అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో స్వయంగా చెర్రీ పవన్‌ ఇంటికి వెళ్లి తన శుభాకాంక్షలు తెలియజేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంది. మరి జనరల్‌ విషెస్‌ తెలియజేయడం కోసమే వెళ్లాడా? అంతకు మించి ఇంకేదైనా విశేషం ఉందా? అనేది ఆసక్తి నెలకొంది.

 దీంతో పవన్‌ అభిమానులు, చెర్రీ అభిమానులు, మొత్తంగా మెగా అభిమానులు ఫుల్‌ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ ఇంట సంక్రాంతి సంబరాల్లో నాగార్జున సందడి చేశారు. చిరంజీవి, రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌, సాయితేజ్‌ ఇలా మెగా హీరోలు పాల్గొనగా, వారితోపాటు నాగార్జున కూడా కనిపించారు.ఈ  ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.