సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్ మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు హీరోలు తమ కుటుంబాలతో కలిసి ఫారెన్ ట్రిప్ లకు వెళ్తుంటారు. కలిసి పార్టీలు చేసుకుంటూ ఉంటారు.

మహేష్ కూతురు సితారని చరణ్ భార్య ఉపాసన ప్రేమగా చూసుకుంటుంది. మరోసారి ఈ రెండు ఫ్యామిలీలు కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాయి. మహేష్ బాబు అతడి భార్య నమ్రత, రామ్ చరణ్-ఉపాసనల జంట, మరికొంతమంది సన్నిహితులు కలిసి ఈ వేడుకను జరుపుకున్నారు.

దీనికి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలను చూసిన మహేష్, చరణ్ అభిమానులు మురిసిపోతున్నారు. ప్రస్తుతం మహేష్ 'మహర్షి' సినిమాతో బిజీగా గడుపుతున్నారు.

మరోపక్క రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదలైన తరువాత చరణ్ పూర్తిగా రాజమౌళి చిత్రానికే సమయం కేటాయించనున్నాడు.