`ఆర్‌ఆర్‌ఆర్` వాయిదా పడ్డందుకు బాధ లేదన్న రామ్‌చరణ్.. అనుపమా డాన్సుకి ఫిదా
`రౌడీబాయ్స్` చిత్ర ఈవెంట్‌లో `ఆర్‌ఆర్‌ఆర్` సినిమాపై రామ్‌చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా వాయిదా పడటం తమకు పెద్దగా బాధగా లేదన్నారు.
రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రం జనవరి 7న విడుదల కావాల్సి ఉండగా, కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సినిమాని వాయిదా వేశారు. దీంతో దేశ వ్యాప్తంగా అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఇక `ఆర్‌ఆర్‌ఆర్` విడుదల కావాలంటే ఎన్టీఆర్, రామ్‌చరణ్ వృద్దులు అవుతారంటూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రామ్‌చరణ్ `ఆర్‌ఆర్‌ఆర్`పై స్పందించారు. సినిమా వాయిదా పడ్డందుకు తనకు బాధగా లేదన్నారు. కరోనా సమయంలో వాయిదా పడటంపై ఆయన ఈ విధంగా వెల్లడించారు.
అనుపమా పరమేశ్వరన్, ఆశిష్ రెడ్డి జంటగా నటించిన చిత్రం 'రౌడీ బాయ్స్'. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. దీనికి రామ్‌చరణ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ.. `మా సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ కాకపోయినా మాకేం బాధ లేదు. ఎందుకంటే అలాంటి చిత్రం సరైన సమయంలో రావాలి. ఆ సినిమా కోసం మూడున్నర సంవత్సరాలు చాలా కష్టపడ్డాం. దాని గురించి దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య నిర్ణయిస్తారని పేర్కొన్నాడు.
`మాకు సంక్రాంతి ఎంత ముఖ్యమో కాదో మాకు తెలీదు కానీ.. సంక్రాంతి పండుగకి దిల్ రాజు గారు మాత్రం చాలా ముఖ్యం. సంక్రాంతి మమ్మల్ని వదులుకోడానికైనా రెడీగా వుంది కానీ దిల్ రాజుని వదులుకోడానికి రెడీగా లేదు. ఇలాంటి సక్సస్ ఫుల్ సంక్రాంతులు ఎన్నో దిల్ రాజు చూసాడు. ఈ సంక్రాంతి కూడా ఆయనదే అవ్వాలి. కాశ్మీర్ టూ కన్యాకుమారి ఎక్కడ ఫంక్షన్ జరిగిన మా అబ్బాయిలు(ఫ్యాన్స్) వస్తున్నారు. వారికి ధన్యవాదాలు. మమ్మల్ని ఆదరించినట్టుగానే ఆశిష్‌ని ఆదరించాలన్నారు చరణ్.
ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్‌పై ప్రశంసలు కురిపించారు రామ్‌చరణ్. సోషల్ మీడియాలో ఆమెని ఫాలో అవుతుంటానని, ఆమె ఎక్కడ వచ్చినా రూమ్‌లో లైట్‌లాగా వెలుగుతుందన్నారు. చార్మింగ్ పర్సనాలిటీ మీది అని, అనుపమా స్మైల్ ఎంతో బ్యూటీఫుల్‌గా ఉంటుందన్నారు చరణ్. తెలుగు ఆడియెన్స్ కి తక్కువ మంది తొందరగా నచ్చుతారు. అందులో టాప్‌లో అనుపమా ఉంటారు. ఆమె ఆశిష్ పక్కన ఉండటం పెద్ద అసెట్ అన్నారు చెర్రీ. చరణ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిబ్బయ్యింది అనుపమా. అయితే రామ్‌చరణ్ వచ్చాక అనుపమా స్టేజ్‌పై చేసిన డాన్సుకి చెర్రీ ఫిదా అయిపోయారు.
అలాగే హీరో ఆశిష్ ని అభినందించారు చరణ్. కష్టపడే తత్వం నీలో ఉందన్నారు. ఎంత బ్యాక్ ఇమేజ్ ఉన్నా, కష్టపడాల్సిందే అన్నారు. ఎంత టాలెంట్ ఉన్నా,డిసిప్లెయిన్ ఉండాలన్నారు. మా నాన్నగారు(చిరంజీవి) నాకు ఇదే చెప్పారన్నారు చరణ్. పెద్ద వారు ఇదే చేస్తూ ఈ స్తాయికి వచ్చారన్నారు. తాను ప్రొడక్షన్ చేసినా ఇష్టం మాత్రం నటనే అని తెలిపారు. ఆశిష్ ప్రొడక్షన్ ఫ్యామిలీ నుంచి వచ్చినా యాక్టింగ్‌పై ఫోకస్ పెట్టాలన్నారు చరణ్.