గత కొన్ని వారాలుగా రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ యుఎస్ లోనే ఉంటూ ఆస్కార్ అవార్డుల కోసం ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని క్షణం తీరిక లేకుండా ప్రమోట్ చేస్తున్నారు. నేడు లాస్ ఏంజిల్స్ లో ఆస్కార్ అవార్డుల వేడుక వైభవంగా జరగబోతోంది.

నేడు జరగబోతున్న ఆస్కార్స్ వేడుక కోసం దేశం మొత్తం సినీ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు దక్కాలని ప్రతి ఇండియన్ కోరుకుంటున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు ఫైనల్ నామినేషన్స్ లో నిలిచింది.

గత కొన్ని వారాలుగా రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ యుఎస్ లోనే ఉంటూ ఆస్కార్ అవార్డుల కోసం ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని క్షణం తీరిక లేకుండా ప్రమోట్ చేస్తున్నారు. నేడు లాస్ ఏంజిల్స్ లో ఆస్కార్ అవార్డుల వేడుక వైభవంగా జరగబోతోంది. దీనికోసం ఆర్ఆర్ఆర్ టీం రెడీ అయింది. ఇదిలా ఉండగా ఆస్కార్ ఈవెంట్ కి ముందు రాంచరణ్ లాస్ ఏంజిల్స్ లో మెగా అభిమానులు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. 

రాంచరణ్ ని చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డు గెలవాలని అభిమానులు చరణ్ ని విష్ చేశారు. ఈ ఈవెంట్ లో రాంచరణ్ మాట్లాడుతూ.. ఇండియాలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం సులభంగా ఉంటుంది. కానీ అమెరికాలో ఎంత కష్టమో నాకు తెలుసు. మా మీదున్న అభిమానంతో అమెరికాలోని పలు ప్రాంతాల నుంచి విమానాలు, కార్లలో ఇలా చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కిడికి వచ్చిన అభిమానులు అందరికీ కృతజ్ఞత చెప్పడం చాలా చిన్నది అవుతుంది. మీ అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుంటా. ఇలా అభిమానించే వాళ్లను కలిసినప్పుడు మాలో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఈ అభిమానం చూస్తే సినిమాల్లో ఇంకేదో చేసి మిమ్మల్ని మెప్పించాలనే కసి పెరుగుతుంది. మీ ఆధారాభిమానాల వల్లే ఈ స్టేజ్‌లో ఉన్నాను అని అన్నారు.

ఈ ట్రిప్‌ను ఎప్పటికీ మరచిపోలేను. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వాడిగా కాదు.. తెలుగువాడిగా, భారతీయుడిగా మనమంతా ఓ చరిత్ర సృష్టించబోతున్నాం. ఈ హిస్టరీలో మీరంతా భాగమే. ఈరోజు దాని విలువ మనకు తెలుసో, లేదో చెప్పలేం కానీ, రానున్న రోజుల్లో అంటే ఓ పదేళ్ల తర్వాత అయినా ఈ రోజుల విలువేంటో తెలుస్తుంది. అలాగే చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ గురించి.. యుఎస్ లో మెగా అభిమానులు చేస్తున్న చారిటీ కార్యక్రమాల గురించి కూడా రాంచరణ్ మాట్లాడారు. అభిమానులందరితో సెల్ఫీలు దిగారు.