ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు భాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. వినయ విధేయరామ, ఎన్టీఆర్ బయోపిక్ .. ఈ రెండు చిత్రాలు ..రెండు రోజులో విడుదల అవుతున్నాయి.  వినయ విధేయ రామ చిత్రం జనవరి 11 న రిలీజ్ అవుతూంటే, ఎన్టీఆర్  బయోపిక్ ..జనవరి 9 న విడుదల కానుంది. ఈ నేఫద్యంలో ఈ రెండు చిత్రాల మధ్యా ఓ రేంజిలో పోటీ నెలకొని ఉంది. రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ నడుస్తోంది. 

అయితే ఇక్కడే ఓ విషయం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే... ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సపోర్ట్ ఇస్తూంటే, వినయ విధేయ రామ సినిమాకు తెలంగాణా ప్రభుత్వం సపోర్ట్ అందించనుంది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి బాలకృష్ణ నిర్మాత కావటంతో ఆయన బావ చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి కావటం రిలీజ్ టైమ్ లో ప్లస్ అవుతుంది. అలాగే ఇక్కడ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు , టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రామ్ చరణ్ కు ప్రెండ్ కావటం ప్లస్ కానుంది. దాంతో రెండు చిత్రాల ఎర్లీ మార్నింగ్ షోలకు ఫర్మిషన్ దొరకనుంది.  

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న భారీ బ‌డ్జెట్ క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `విన‌య విధేయ రామ‌`. డి.పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాణంగా న‌టిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.

మరో ప్రక్క ఆంధ్రుల ఆరాధ్య దైవం, లెజెండరీ యాక్టర్, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం స్వర్గీయ శ్రీ నందమూరి రామారావు బయోపిక్ ఇప్పుడు టాలీవుడ్ లో సంచాలను సృష్టిస్తుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్రని నందమూరి నటసింహం ప్రస్తుత హిందుపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ చేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖనటి విద్యాబాలన్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తుంది.