Asianet News TeluguAsianet News Telugu

ఇంద్ర మూవీ సెట్స్ లో రామ్ చరణ్.. అప్పుడు ఇలా ఉండేవాడా? అసలు గుర్తుపట్టలేరు!

ఇంద్ర రీరిలీజ్ నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాణ సంస్థ మేకింగ్ వీడియో షేర్ చేస్తుంది. ఇంద్ర సెట్స్ లో రామ్ చరణ్ కనిపించాడు. ఆయన టీనేజ్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. 
 

ram charan in chiranjeevi starer indra movie shootings sets making video goes viral ksr
Author
First Published Aug 22, 2024, 3:21 PM IST | Last Updated Aug 22, 2024, 3:21 PM IST

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా బ్లాక్ బస్టర్ ఇంద్ర రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 22న తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఇంద్ర విడుదలైంది. చిరంజీవి డైహార్డ్ ఫ్యాన్స్ ఉదయాన్నే ఇంద్ర ప్రదర్శిస్తున్న థియేటర్స్ కి పోటెత్తారు. ఇంద్రసేనారెడ్డిగా చిరంజీవి విశ్వరూపాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఎంజాయ్ చేస్తున్నారు. 2002లో విడుదలైన ఇంద్ర ఇండస్ట్రీ హిట్. చిరంజీవి మొదటిసారి పూర్తి స్థాయి ఫ్యాక్షన్ జోనర్ లో మూవీ చేశారు. 

ఫ్యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే దర్శకుడు బీ గోపాల్ ఇంద్ర చిత్రాన్ని తెరకెక్కించాడు. అంతకు ముందు ఆయన బాలకృష్ణతో ఫ్యాక్షన్ నేపథ్యంలో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు తీసి భారీ విజయాలు నమోదు చేశాడు. ఇంద్ర చిత్రంలో చిరంజీవికి జంటగా సోనాలీ బింద్రే, ఆర్తి అగర్వాల్ నటించారు. ఇంద్ర మూవీకి మణిశర్మ సాంగ్స్ మరో హైలెట్. 

నిర్మాత అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఇంద్ర చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇంద్ర రీరిలీజ్ నేపథ్యంలో వైజయంతీ మూవీస్ సంస్థ ఇంద్ర మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో చిరంజీవి-ఆర్తి అగర్వాల్ కాంబోలో ''అమ్మడో అప్పచ్చి'' సాంగ్ చిత్రీకరించారు. ఈ సాంగ్ కి లారెన్స్ కొరియోగ్రఫీ కంపోజ్ చేశాడు. 

ram charan in chiranjeevi starer indra movie shootings sets making video goes viral ksr

అమ్మడో అప్పచ్చి సాంగ్ షూట్ సమయంలో సెట్స్ కి రామ్ చరణ్, శ్రీజ, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వచ్చారు. వైజయంతీ మూవీస్ విడుదల చేసిన మేకింగ్ వీడియోలో చిన్నప్పటి రామ్ చరణ్ లుక్ ఆకర్షించింది. ఇంద్ర సినిమా నాటికి టీనేజ్ లో ఉన్న రామ్ చరణ్ డిఫరెంట్ గా ఉన్నాడు. ఆయన ప్రస్తుత లుక్ కి అప్పటి లుక్ కి చాలా వ్యత్యాసం ఉంది. ఇంద్ర మేకింగ్ వీడియోలో రామ్ చరణ్ ని చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. 

అప్పటి నుండే సినిమా మీద అవగాహన పెంచుకునేందుకు రామ్ చరణ్ ప్రయత్నం చేస్తున్నట్లు ఆ వీడియో చూస్తే అర్థం అవుతుంది. నిర్మాత అశ్వినీ దత్  రామ్ చరణ్ తో సంభాషించడం మనం చూడొచ్చు. కాగా ఇంద్ర విడుదలైన ఐదేళ్లకు 2007లో రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిరుత చరణ్ డెబ్యూ మూవీ.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios