రామ్ చరణ్ ఆచార్య సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక ఈసినిమా తరువాత అనుకున్న సినిమాల్లో గౌతమ్ తిన్ననూరి సినిమా కూడా ఉంది. ఈ సినిమా కాన్సిల్ అయ్యిందంటూ వచ్చిన గాసిప్స్ పై రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఈ సినిమా ఉన్నట్టా..? లేనట్టా..?
రామ్ చరణ్ ఆచార్య సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక ఈసినిమా తరువాత అనుకున్న సినిమాల్లో గౌతమ్ తిన్ననూరి సినిమా కూడా ఉంది. ఈ సినిమా కాన్సిల్ అయ్యిందంటూ వచ్చిన గాసిప్స్ పై రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఈ సినిమా ఉన్నట్టా..? లేనట్టా..?
మెగాస్టార్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది మూవీ. కొరటాలశివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ తో హడావిడి చేస్తున్నారు. ఇక ఈమూవీ ప్రమోషన్స్ సందర్భంగా చరణ్ తన నెక్ట్స్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఆచార్య ప్రమోషన్స్ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూస్ లో గౌతమ్ తిన్ననూరితో చేయనున్న సినిమాకి సంబంధించిన ప్రశ్న చరణ్ కి ఎదురైంది. అయితే టాలీవుడ్ లో ఇంతకుముందు నానీతో జెర్సీ సినిమాను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి, ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ కొట్టాడు. అయితే అదే సినిమాను హిందీలోను రీమేక్ చేశాడు. కాని ఈ సినిమా అక్కడ అనుకున్నంతగా ఆడలేదు. హిందీ జెర్సీ ప్లాప్ తో చాలా విమర్షలు వచ్చాయి.
ఆ తరువాత సినిమాను చరణ్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు. జెర్సీ ప్లాప్ తో గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ సినిమా ఉంటుందో ఉండదో అని సోషల్ ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ సినిమా కూడా కూడా స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతుందనే టాక్ వచ్చింది. ఆచార్య ప్రమోషన్స్ లో ఇదే ప్రశ్న చరణ్ కి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ.. ఈ కథ స్పోర్ట్స్ నేపథ్యానికి సంబంధించినది కాదు. ఎమోషన్ తో కూడిన యాక్షన్ డ్రామాగా సాగుతుంది అంటూ స్పష్టం చేశాడు.
దాంతో గౌతమ్ తో సినిమా కాన్సిల్ అవ్వలేదని. ఈ సినిమా చేయడానికి రామ్ చరణ్ ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈమూవీ సెట్స్ పైకి వెళ్లబోతోందట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక .. కృతి శెట్టి పేర్లు వినిపిస్తున్నాయి. శంకర్ సినిమా తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు సమాచారం.
