యాంకర్‌ సుమ చిరంజీవి, రామ్‌చరణ్‌, కొరటాలకు కొన్ని ప్రశ్నలు సంధించింది. దానికి చిరంజీవి, చరణ్‌, కొరటాల సమాధానం చెప్పారు. ఇందులో పలు ఫన్నీ ప్రశ్నలు, సమాధానాలుండటం విశేషం.

ఎప్పుడూ సైలెంట్‌గా కనిపించే రామ్‌చరణ్‌(Ram Vharan) లోనూ చిలిపితనం ఉందట. అల్లరి తనానికి కొదవే లేదట. దానికి కారణం మాత్రం బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan) అని అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi). రామ్‌చరణ్‌తో కలిసి ఆయన నటించిన చిత్రం `ఆచార్య`(Acharya). కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కాబోతుంది. కాజల్‌, పూజా హెగ్డే కథానాయికలుగా నటించారు. రామ్‌చరణ్‌, నిరంజన్‌రెడ్డి నిర్మించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. 

ఇందులో కొరటాల శివ, రామ్‌చరణ్‌, రాజమౌళి, చిరంజీవి మాట్లాడేందుకు ముందు యాంకర్‌ సుమ చిన్న ట్విస్ట్ ఇచ్చింది. చిరంజీవి, రామ్‌చరణ్‌, కొరటాలకు కొన్ని ప్రశ్నలు సంధించింది. దానికి చిరంజీవి, చరణ్‌, కొరటాల సమాధానం చెప్పారు. ఇందులో పలు ఫన్నీ ప్రశ్నలు, సమాధానాలుండటం విశేషం. ఇందులో అమ్మచేతి వంటకి మించిన తీయదనం మరెందులోనూ ఉండదని చిరంజీవి చెప్పారు. చిరంజీవి,చరణ్‌లో బెస్ట్ డాన్సర్‌ ఎవరు అని అడిగిన ప్రశ్నకి, నాన్నగారే అని చరణ్‌ చెబుతుండగా, మధ్యలో కల్పించుకున్న చిరు..`నా పేరు శివ శంకర వరప్రసాద్‌. శివుడు నృత్యానికి ప్రసిద్ధి. శివుడి ముందు ఎంతమంది డాన్స్‌ వేసిన అది డాన్స్‌ అనుకుంటారు తప్ప... శివతాండవం తర్వాతే ఏదైనా. ఎవరైనా! అప్పుడప్పుడూ చరణ్‌లాంటి వాళ్లను ఎంకరేజ్‌ చేయాలి కాబట్టి తగ్గుతూ ఉంటా` అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది. 

చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ ఇంట్లో `ఆచార్య` ఎవరని రామ్‌చరణ్‌ని అడగ్గా, దీనికి సమాధానం చెప్పడం కష్టమన్నారు చరణ్‌. అయితే తన నుంచి క్రమశిక్షణ, బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌ నుంచి అల్లరి, చిలిపితనం నేర్చుకున్నాడని చెప్పారు చిరంజీవి. ఈ సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎప్పుడూ సైలెంట్‌గా, హుందాగా కనిపించే రామ్‌చరణ్‌లో చిలిపితనం, అల్లరి తనం కూడా ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రెస్‌మీట్‌లోనూ రాజమౌళి.. చరణ్‌ గురించి కూడా ఇదే చెప్పారు. అంతేకాదు పవన్‌ కళ్యాణ్‌ కూడా సైలెంట్‌గానే ఉంటారు. కానీ చిరంజీవి మాత్రం చరణ్‌లో అల్లరి, చిలిపితనం ఉన్నాయని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

ఇదిలా ఉంటే మరో షాకింగ్‌ క్వచ్చన్‌ సంధించింది యాంకర్‌ సుమ. ఇంట్లో ఎవరికి భయపడతారు చిరంజీవి? ఉపాసన? అని అడగ్గా, చరణ్‌ స్పందిస్తూ నాన్న చిరంజీవి అమ్మ ముందు జాగ్రత్తగా ఉంటారు, నేను కూడా అదే నేర్చుకుని ఉపాసన ముందు జాగ్రత్తగా ఉంటాను` అని తెలిపారు చరణ్‌. దీంతో `ఆచార్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌` ప్రాంగణం మొత్తం అభిమానుల అరుపులతో దద్దరిల్లింది. ఇక `ఆచార్య` చిత్రంలోని ఆచార్య పాత్ర, సిద్ధ పాత్రలో ఏదంటే ఇష్టమని చిరంజీవి అడగ్గా, రెండు పాత్రలు ముందు పెడితే తాను సిద్ధ పాత్రనే చేస్తానని తెలిపారు. ఆ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని వెల్లడించారు.