మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. ఈ చిత్రం 1000 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. ఈ చిత్రం 1000 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. రాంచరణ్ అల్లూరిగా, ఎన్టీఆర్ కొమరం భీం గా నటనతో అదరగొట్టారు. నార్త్ లో కూడా వీరిద్దరికి క్రేజ్ పెరిగిపోయింది.
ప్రస్తుతం రాంచరణ్ తన తదుపరి చిత్రం RC15 కోసం అమృత్ సర్ లో షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో వచ్చిన క్రేజ్ తో రాంచరణ్ ని చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. గత కొన్ని రోజులుగా అమృత్ సర్ నుంచి రాంచరణ్ కి సంబందించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాంచరణ్ షూటింగ్ లొకేషన్ నుంచి వెళుతుండగా కారు వద్ద అభిమానులు అతడిని చుట్టుముట్టారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ రాంచరణ్ తో సెల్ఫీ కోసం ఎగబడ్డారు. ఫ్యాన్స్ గుంపుగా మీదికి వస్తున్నప్పటికీ రాంచరణ్ కూల్ యాటిట్యూడ్ ప్రదర్శించాడు. ఓపిగ్గా అభిమానులకు సెల్ఫీలు ఇచ్చాడు.
రాంచరణ్ యాటిట్యూడ్ హృదయాలు దోచుకునే విధంగా ఉంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ ని శ్రీరాముడిగా ప్రాజెక్ట్ చేయడం నార్త్ లో బాగా క్లిక్ అయింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ పాత్ర కంటే ఎన్టీఆర్ పాత్రని తగ్గించారనే విమర్శలు కూడా ఉన్నాయి.
కానీ కథ పరంగా ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఉందనేది ప్రేక్షకుల వాదన. ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ మరో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15 అవినీతి నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. శంకర్ స్టైల్ లో ఈ మూవీలో పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి.
ఈ చిత్రంలో రాంచరణ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. తమన్ సంగీత దర్శకుడు. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.
