రికార్డ్ ప్రైస్ కు "గేమ్ ఛేంజర్" OTT రైట్స్ అమ్మకం, ఎవరికి,ఎంతకి?!
సినీ లవర్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రాల్లో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ఒకటి. రామ్ చరణ్ (Ram Charan) హీరోగా దర్శకుడు శంకర్ (S Shankar) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఓటిటి డీల్ క్లోజ్ అయ్యినట్లు వార్తలు వస్తున్నాయి.

రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. RRR మూవీతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యిన ఈ మెగా పవర్ స్టార్ ఈ చిత్రం తర్వాత చేస్తున్న మూవీ "గేమ్ ఛేంజర్". భారీ చిత్రాలకు కేరాఫ్ అయిన దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం..అంతకు మించి అనే స్దాయిలో రూపొందిస్తున్నాడని వినికిడి. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రైట్స్ గురించిన ఓ వార్త బయిటకు వచ్చింది.
#GameChanger పోస్ట్ థియేటర్ స్ట్రీమింగ్ రైట్స్ ని Zee5 వారు ₹270 cr కోట్లకు సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇది రికార్డ్ ప్రైస్ అని చెప్పాలి. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. తమిళ సినిమా వర్గాలు, మీడియా నుంచి వస్తున్న వార్త. ఇది నిజమైనా కాకపోయినా, దిల్ రాజుకు జాక్ పాట్ లాంటి ప్రాజెక్టు అవుతోందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు మొదట అనుకున్న దానికన్నా భారీగా ఖర్చు పెరిగిపోతోందని సమాచారం. నిర్మాత దిల్ రాజు 50వ చిత్రం కావడంతో.. ఖర్చు విషయంలో తగ్గేదే లే అంటున్నారట. ఇక, ఈ చిత్ర క్లైమాక్స్.. ఇప్పటి వరకూ చూడని విధంగా అత్యంత భారీగా ప్లాన్ చేస్తున్నాడట శంకర్. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీని రిలీజ్ చేయడానికి చూస్తున్నట్టు సమాచారం.
కియారా అడ్వాణీ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. కొద్దిమంది ఆర్టిస్ట్ లు అందుబాటులో లేనందున ఈ సెప్టెంబరు షెడ్యూల్‌ను రద్దు చేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అక్టోబరు రెండో వారంలో మళ్లీ షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించింది. రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో చరణ్ భిన్న కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమా విడుదల తేదీ కోసం చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు చిత్ర బృందం ఆ అప్‌డేట్ ఇవ్వలేదు. మరోవైపు, కొన్ని రోజుల క్రితం ఓ పాట లీక్‌కాగా నిర్మాత దిల్ రాజు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. పాటను లీక్ చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, అంజలి, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. తిరు ఛాయాగ్రాహకుడు.