ఎట్టకేలకు మెగా వారసురాలు వచ్చేసింది. కూతురు పుట్టిన ఆనందంలో.. మెగా ఫ్యామిలీ అంతా దిల్ ఖుష్ అవుతున్నారు. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే  రామ్ చరణ్ తన సినిమా షూటింగ్స్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.  

రీసెంట్ గా తన కూతురుకు స్వాగతం పలికారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన. మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగిపోగా.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక రాంచరణ్‌ చాలా రోజులుగా షూటింగ్ కు వెళ్ళడం లేదు. ఆస్కార్ వేడుకల తరువాత ఆయన షూటింగ్ స్పాట్ కు వెళింది లేదు. ప్రస్తుతం కూతురు పుట్టడంతో.. మరో నెల ఫ్యామిలీతో చరణ్ గడపబోతున్నారని వార్తలు వినిపించాయి. 

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కూతురు పుట్టిన ఆనందంలో ఉన్న రాంచరణ్‌ ఇక ఎలాంటి బ్రేక్‌ తీసుకోకుండా షూట్‌పై ఫోకస్‌ పెట్టబోతున్నాడట. సూపర్ ఫాస్ట్ గా సినిమాను కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. షూటింగ్ త్వరగా పూర్తి చేసి.. కొత్త సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు కాస్త గ్యాప్ తీసుకోవాలని మరో ఆలోచనలో ఉన్నాడట చరణ్. తాజా అప్‌డేట్‌ ప్రకారం జులైలో షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నాడు చరణ్‌. 2024 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది గేమ్‌ ఛేంజర్‌. 

ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్ చేసిన మూవీ లుక్స్ అన్నింటికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతకంతకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ తరువాత చరణ్ ఆచార్య తో భారీ ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. ఇక ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు మూవీ టీమ్. 

ఇక గేమ్‌ ఛేంజర్‌ సినిమా స్టార్ డైరెక్టర్ శంకర్‌ ‌ దర్శకత్వంలో 15 ప్రాజెక్టుగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. . రాంచరణ్‌ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్‌ విలన్‌గా నటిస్తుండగా.. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లోఈ సినిమాతెరకెక్కుతోంది. ఇక మరో హీరోయిన్ గా కీ రోల్ లో అంజ‌లి నటిస్తుండగా విలన్ గా ఎస్‌జే సూర్య..ఇతర పాత్రల్లో శ్రీకాంత్‌, స‌ముద్రఖని, న‌వీన్ చంద్ర‌, జ‌య‌రాయ్‌, సునీల్ ఇత‌ర కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. 

ఈ మూవీని శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు స్క్రీన్ ప్లే రాస్తుండగా... సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా గ్యాప్ లో అటు శంకర్ కమల్ హాసన్ ఇండియన్2 సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.