వేధిస్తున్న వరుస లీక్స్, శంకర్ స్ట్రిక్ట్ వార్నింగ్.. గేమ్ ఛేంజర్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శంకర్.. మరో పక్క కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శంకర్.. మరో పక్క కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. దీనితో గేమ్ ఛేంజర్ ఆలస్యం అవుతూ వస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా శంకర్ ఈ చిత్రాన్ని తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు.
అయితే ఈ చిత్రాన్ని వరుసగా లీక్స్ వేధిస్తున్నాయి. రాంచరణ్ ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడు. ఒక పాత్రలో రాంచరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. తండ్రి పాత్రలోని లుక్ ఇంటర్నెట్ లో లీక్ అయింది. ఆ తర్వాత ఒక సాంగ్ లీక్ అయింది. తరచుగా చిత్రానికి సంబందించిన పిక్స్ ఇంటర్నెట్ లో లీక్ అవుతూనే ఉన్నాయి.
రీసెంట్ గా మరో సాంగ్ లీక్ కావడంతో గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ బాగా అప్సెట్ అయింది. శంకర్ తన టీమ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వరుస లీక్ ల నేపథ్యంలో గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ లాంగ్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. ఈ వీకెండ్ నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.
దీనితో ఇకపై ఎలాంటి లీకులు లేకుండా తన టీం కి శంకర్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో శంకర్ రాంచరణ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రాంచరణ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి, సునీల్, ఎస్ జె సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. డైరెక్టర్ శంకర్ తనదైన శైలిలో ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు, కనుల విందు చేసే పాటలని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎలక్షన్ నిర్వహణపై సెటైర్లు సంధించేలా, లోపాలని ఎత్తి చూపేలా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.