రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ మూవీ, చిరంజీవి ప్లాన్ అదే, భయపడిపోయినా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్
రామ్ చరణ్ హీరోగా `చిరుత` చిత్రంతో వెండితెరకి పరిచయమైన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఎవరికీ తెలియని విషయాలు బయటకు వచ్చాయి.
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా, నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. ఆయన `చిరుత` సినిమాతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలై 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. రామ్ చరణ్ హీరోగా పరిచయం కావాల్సింది పూరీ జగన్నాథ్‌తో కాదు, చిరంజీవి ప్లాన్ చేసింది ఆ పాన్ ఇండియా డైరెక్టర్‌తో కావడం విశేషం. ఆ కథేంటో చూస్తే..
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మొదట శంకర్ డైరెక్షన్‌లో..?
మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో ఆయన మహావృక్షంలా ఎదిగారు. ఆయన నీడలో ఎంతో మంది స్టార్లు వచ్చారు. రాణిస్తున్నారు. అయితే తన కొడుకు రామ్ చరణ్‌ని హీరోగా ఎంట్రీకి సంబంధించి చిరంజీవి చాలా ప్లాన్స్ చేశారు. చాలా మంది దర్శకులను ఆప్షన్‌గా తీసుకున్నారు. మొదట శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఉంటుందనే వార్తలు వచ్చాయి. కానీ అవి గాసిప్పులుగానే మిగిలిపోయాయి. ఆ తర్వాత చాలా మంది దర్శకుల పేర్లు వచ్చాయి. అందులో వివి వినాయక్, శ్రీనువైట్ల పేర్లు ఉన్నాయి. వాళ్లు కథలు కూడా వినిపించారట. కానీ చిరంజీవికి నచ్చలేదు.
రాజమౌళి దర్శకత్వంలో చరణ్ ఎంట్రీ ప్లాన్..
నిజానికి రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఎంట్రీ అయితే బాగుంటుందని చిరంజీవి భావించారు. జక్కన్నని పిలిపించి సినిమా చేయాలని అడిగాడు. మొదట ఓకే అనుకున్న రాజమౌళి లైన్ కూడా నెరేట్ చేశాడట. చిరంజీవికి కూడా నచ్చింది. ఆ తర్వాత ఎందుకు రాజమౌళి వెనక్కి తగ్గాడు. రామ్ చరణ్ ఎలా ఉంటాడు, ఎలా యాక్ట్ చేస్తాడు? తన బలాలు ఏంటి? వీక్‌నెస్‌లు ఏంటి? అన్ని చూసుకుని తాను సినిమా చేస్తానని, ఎందుకంటే చిరంజీవి తనయుడు సినిమా ఎంట్రీ అంటూ అభిమానుల్లో భారీ అంచనాలుంటాయి. వాటిని రీచ్ కాకపోతే చాలా బ్యాడ్ నేమ్ వస్తుందని జక్కన్న వెనక్కి తగ్గాడట. రెండో సినిమా చేస్తానని చెప్పి జక్కన్న తప్పుకున్నారు .
`పోకిరి`తో పూరీ ట్రాక్‌లోకి..
అప్పుడే దర్శకుడు పూరీ జగన్నాథ్ `పోకిరి` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ సినిమా చిరుకి కూడా బాగా నచ్చింది. ఇలాంటి మాస్ కమర్షియల్ యాక్షన్ మూవీ అయితే బాగుంటుందని భావించి పూరీకి ఆ బాధ్యతలు అప్పగించారు. చిరంజీవి చెప్పడంతో పూరీ కూడా జెట్ స్పీతో కథ రెడీ చేశాడు. అలా `చిరుత` సినిమా పట్టాలెక్కింది. ఇందులో నేహా శర్మని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ అమ్మాయి కొత్త. ఈ మూవీతోనే వెండితెరకి పరిచయం చేశారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించారు. అలా `చిరుత` రామ్ చరణ్ హీరోగా వెండితెరకి పరిచయమయ్యారు. ఈ మూవీ 2007లో సెప్టెంబర్ 28న విడుదలై పెద్ద హిట్ అయ్యింది. చరణ్‌కి గ్రాండ్ ఎంట్రీగా నిలిచిందని చెప్పొచ్చు. ఈ సినిమా నేటితో 17 ఏళ్లు పూర్తి చేసుకుంది.
గ్లోబల్ స్టార్ ఇమేజ్..
`చిరుత`తో స్టార్ట్ అయిన చరణ్ ప్రయాణం మెగా పవర్ స్టార్ నుంచి, గ్లోబల్ స్టార్ ఇమేజ్ వరకు వెళ్లింది. `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రం తర్వాత ఆయన రేంజ్ చాలా మారిపోయింది. అంతర్జాతీయంగానూ ఆయనకు గుర్తింపు లభించింది. ఈ మూవీకి `ఆస్కార్` వచ్చే సమయంలో ఆయన ఇంటర్నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలిచ్చి వార్తల్లో నిలిచారు. అదేకాదు పలు ప్రతిష్టాత్మక ఈవెంట్లలోనూ గెస్ట్ గా పాల్గొన్నారు రామ్ చరణ్. చాలా కూల్‌గా తనని తాను బాగాప్రమోట్ చేసుకున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్` సక్సెస్‌ని కరెక్ట్ గా వాడుకున్నది చరణే అని చెప్పాలి.
శంకర్‌తో పాన్ ఇండియా మూవీ `గేమ్ ఛేంజర్`..
ప్రస్తుతం రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. రేపు ఈ మూవీ రెండో సాంగ్ రాబోతుంది. ఇండియాలోని ప్రతి రాష్ట్రంలోని కల్చర్‌ని ప్రతిబింబించేలా ఈ పాటని రూపొందించారట శంకర్. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోని కూడా విడుదల చేశారు. థమన్‌తో కలిసి చర్చించిన విషయాన్ని ఆయన వెల్లడించారు. అది వైరల్ అవుతుంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్ జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు.