ప్రపంచ వ్యాప్తంగా మెగా,నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. థియేటర్ల దగ్గర అభిమానుల కోలాహలం మూమూలుగా లేదు. అంతే కాదు తమ అభిమానల నటులకు రకరకాల రూపాల్లో బహుమతులు అందిస్తన్నారు ఫ్యాన్స్. ఈసారి చరణ్ అబిమానులు చిత్రంగా సందడి చేశారు. 

రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ రాజుగా, జూనియ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా రాజమౌళి సృష్టించిన అద్భఉతం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఈరోజు ( మార్చ్ 25) రిలీజ్ అయ్యి సంచలనం సృష్టిస్తుంది. బాహుబ‌లి వంటి భారీ హిట్‌ త‌ర్వాత రాజ‌మౌళి రూపొందించిన ఈ సినిమాపైనే ప్ర‌స్తుతం అంద‌రి దృష్టి నెల‌కొంది. 

ఈ సినిమాకు అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. రీసెంట్ గా ముక్కుతో చరణ్, తారక్, రాజమౌళి పెయింటింగ్ వేశాడు ఓ అభిమాని.. బెనిఫిట్ షోకు 70 టికెట్లు కొన్నాడు మరో అభిమాని.. ఇలా రకరకాలుగా తమ హీరోలపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈరోజు రిలీజ్ సందర్భంగా చరణ్ ఫ్యాన్స్ ఆయన మీద ప్రేమను డిఫరెంట్ గా చాటుకున్నారు.

Scroll to load tweet…

ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ చరణ్ అభిమానులు అల్లూరి వేషం కట్టారు. హైద‌రాబాద్‌కు ప‌లు ప్రాంతాల నుంచి చెర్రీ అభిమానులు అల్లూరి సీతారామరాజు వేషంలో సందడి చేశారు. దాదాపు 100 మంది ఫ్యాన్స్ అల్లూరి సీతారామ రాజు వేష‌ధార‌ణ‌తో రావ‌డం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది.అంతే కాదు వారంతా బైకుల‌పై ర్యాలీగా హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ట్రిపుల్ ఆర్ సినిమా చూసి సందడ చేశారు. ఇక ఈ వేషాలకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో జోరుగా తిరుగుతుంది.