మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆర్సీ15’. శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా షూటింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్ర యూనిట్ తీరుకు చరణ్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆర్సీ15’RC15. క్రియేటివ్ అండ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. గతేడాది చివర్లలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉన్న విషయం తెలిసిందే. ఇఫ్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే హైదరాబాల్, విశాఖపట్నం, ఏపీ, మహారాష్ట్ర, పంజాబ్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే షూటింగ్ జరుపుకుంది.

రీసెంట్ గా న్యూజిలాండ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి, వైజాగ్, కర్నూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే, చిత్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. కనీసం పోస్టర్ కూడా విడుదల కాలేదు. కానీ, రామ్ చరణ్ లుక్, షూటింగ్ స్పాట్ లు, వీడియోలు లీక్ అవుతూ ఉన్నాయి. రీసెంట్ గా ఓ చెరువు కట్టపై రామ్‌చరణ్‌ సైకిల్‌పై వస్తుండటం, అదిరిపోయే సూట్ లో స్టైలిష్ లుక్ లీక్ అయ్యింది. అంతకు ముందు షూటింగ్ వీడియోలు, రామ్ చరణ్ డాన్స్ వీడియోలు నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. 

అయితే, దీనిపై చరణ్ అభిమానులు కాస్తా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ అందించకపోడంతో అప్పటికే అప్సెట్ అయిన ఫ్యాన్స్, పైగా లీక్ లు జరుగుతుండటంతో చిత్ర యూనిట్ పై మండిపడుతున్నారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలో లీక్ లపై శంకర్ కూడా చర్యలు తీసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. రూ.2‌00 కోట్లతో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.