#RC15: రామ్ చరణ్, శంకర్ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ , ఫెరఫెక్ట్ టైమ్
రాంచరణ్ కరియర్ లో 15వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాబోతున్న 50వ ప్రాజెక్ట్ కూడా.

రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా RC 15 ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా గా నటిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తారట. వాటిల్లో ఒకటి విద్యార్థి కాగా, మరొకటి ప్రభుత్వోద్యోగి అని టాక్. ఇక శంకర్-రామ్ చరణ్ కాంబో అనగానే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే మూవీ నిర్మాణంలో కూడా శంకర్ ఎక్కడ రాజీ పడడనే విషయం తెలిసిందే. దాంతో ఎప్పుడెప్పుడు ఈ చిత్రం చూస్తామా అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది.
అందుతున్న సమాచారం మేరకు ... ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సంక్రాతికి వాల్తేరు వీరయ్య చిత్రం వచ్చి సూపర్ హిట్ అవటంతో ...ఖచ్చితంగా తమ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దాంతో ఒక హీరో వచ్చే సంక్రాంతికి తన స్లాట్ బుక్ చేసినట్లు అయ్యింది.
ఈ సినిమాకి ఇప్పటివరకూ ‘విశ్వంభర’, ‘సర్కారోడు’ అనే టైటిల్స్ వినిపించాయి. అలాగే ‘అధికారి’ అనే టైటిల్ తెరపైకి వచ్చింది. చరణ్ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నారు కాబట్టి ఈ టైటిల్ సరిపోతుందనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఈ టైటిల్‌కి పాన్ ఇండియా అప్పీల్ కూడా ఉంటుందని భావిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ ఏప్రియల్ కి పూర్తవుతుందని టాక్.
రాంచరణ్ కరియర్ లో 15వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాబోతున్న 50వ ప్రాజెక్ట్ కూడా. అయితే ఈ సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్ కోసం దర్శక నిర్మాతలు భారీగా ఖర్చుపెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. అలానే శంకర్ ఈ సినిమాలో ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీన్ ను కూడా ప్లాన్ చేశారట. కేవలం ఈ ఒక్క సన్నివేశం కోసమే నిర్మాతలు 10 కోట్ల వరకు ఖర్చు చేసిన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే మరో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరగబోతోంది. ఈ సన్నివేశం సినిమాకి హైలైట్ గా మారుతుందని సమాచారం. అంజలి, శ్రీకాంత్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.