`మనం ఏం చేసినా ప్రాణ నష్టాన్ని తిరిగి భర్తీ చేయలేం. మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలబడగలం. క్లిష్ట సమయాల్లో వారికి మద్దతు ఇవ్వగలం. కుప్పం ఘటనలో చనిపోయిన పవన్‌ అభిమానులకు నా తరపున ప్రతి బాధిత కుటుంబానికి రూ.2.5లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నా` అని రామ్‌చరణ్‌ పేర్కొన్నారు.

కుప్పంలో నిన్న రాత్రి జరిగిన ఘటనలో ముగ్గురు పవన్‌ అభిమానులు చనిపోయిన విషయం తెలిసిందే. పవన్‌ బర్త్ డే ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీంతో పవన్‌తోపాటు మెగా కుటుంబం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యింది. ఇప్పటికే పవన్‌, బన్నీ తమ సాయాన్ని ప్రకటించారు. తాజాగా రామ్‌చరణ్‌ సైతం స్పందించి తన వంతు సాయాన్ని ప్రకటించారు. 

మరోవైపు ఈ రోజు బాబాయ్‌ పవన్‌ బర్త్ డే అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ స్పందిస్తూ పవన్‌కి బర్త్ డే విశెష్‌ తెలిపారు. `పవన్‌ కళ్యాణ్‌.. నా జీవితంలో అత్యంత ప్రామాణికతను, నిజాయితీని ప్రభావితం చేసిన వ్యక్తి. ఆయన మాటలు నన్ను ఉత్తమమైన వ్యక్తిగా మారేందుకు ఎంతగానే ప్రేరేపించాయి, ప్రోత్సహించాయి.. ఎంతో శక్తినిచ్చాయి` అని హ్యాపీబర్త్ డే పవన్‌ కళ్యాణ్‌ యాష్‌ ట్యాగ్‌ని ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ చేశారు. ప్రస్తుతం పవన్‌ బర్త్ డే యాష్‌ ట్యాగ్‌లో ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతున్న విషయం తెలిసిందే.