మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ పట్టాలు ఎక్కించి వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే త్వరలో ఈ సినిమా పూజ కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ కానుంది. 

 రామ్ చరణ్ త్వరలో ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు తో RC16 సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. రంగస్థలం లాగా ఈ సినిమా కూడా ఒక మట్టి మనిషి కథ అని, పల్లెటూరి లో జరిగే స్టోరీ అని రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ కలిసి సంయుక్తంగా ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఇంకా లాంచ్ కాని ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో మొదలవుతుతోంది. అయితే ఈ సినిమా కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అదేమిటంటే..

 RC16 చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ.ఆర్ రహమాన్ కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యే బుచ్చి బాబు, నిర్మాత నవీన్ యెర్నేని రహమాన్ ని కలిసినట్టు సంగీతం విషయంలో చర్చలు జరిపినట్టు, ఆ విషయం రామ్ చరణ్ కి కూడా చెప్పి ఓకే చేయించినట్లు చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఆఫీషియల్ గా ప్రకటించలేదు. మీడియా వర్గాలు దీన్ని సెన్సషనల్ న్యూస్ అంటున్నాయి. కానీ ఫ్యాన్స్ చాలా మంది మాత్రం రహమాన్ కు ఈ మధ్య కమర్షియల్ గా హిట్స్ లేవని , కాబట్టి వేరే మ్యూజిక్ డైరక్టర్ అయితే బెస్ట్ అంటున్నారు. 

అలాగే వెంకటేష్ తో చేసిన #SuperPolice, మహేష్ బాబు తో చేసిన #Naani, పవన్ కళ్యాణ్ తో చేసిన #KomaramPuli సినిమాలు ఏమీ కమర్షియల్ గా డిజాస్టర్స్ అనే విషయం గుర్తు చేస్తున్నారు. రహమాన్ కు అంతర్జాతీయం గా పేరు ఉండచ్చు కానీ తెలుగులో మాత్రం ఆయన చేసిన సినిమాలు లేవి ఆడలేదు కాబట్టి ప్రక్కన పెట్టడం మంచిదని సూచనలు చేస్తున్నారు. అయితే అసలు రహమాన్ ని తీసుకున్నారనే ఈ వార్త నిజమో కాదో మూవీ యూనిట్ నుంచి అఫిషియల్ గా వచ్చే వరకు ఎదురు చూడటం మంచదని అంటున్నారు.

అలాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ ని (Janhvi Kapoor) ఎంపిక చేయాలనీ చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ పట్టాలు ఎక్కించి వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే త్వరలో ఈ సినిమా పూజ కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ కానుంది. 

ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం హాలిడే వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఉపాసనతో కలిసి ఇటీవలే దుబాయ్ వెళ్లి వచ్చిన చరణ్.. ఈ శనివారం (ఏప్రిల్ 8) మాల్దీవ్స్ కి వెళ్లారు. ఇక ఈ టూర్ నుంచి తిరిగి వచ్చాక గేమ్ చెంజర్ (Game Changer) షూటింగ్ పాల్గొనున్నాడు. ఇక శంకర్ అండ్ చరణ్ కలయికలో వస్తున్న గేమ్ చెంజర్ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నారని సమాచారం.