గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతోన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోరేర్ ఫీట్ ను సాధించారు. అది కూడా అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలను క్రాస్ చేస్తూ...సత్తా చాటారు.ఇంతకీ విషయం ఏంటంటే..?
టాలీవుడ్ లో మాత్రమే కాదు.. పాన్ ఇండియాలో తిరుగులేని ఇహేజ్ తో దూసుకుపోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ ను కూడా తన ఖాతాలో వేసుకున్న చెర్రీ.. హాలీవుడ్ లో అవతార్ డైరెక్టర్ తో కూడా శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఎప్పటిక్పుడు తనలో మార్పులు చేసుకుంటూ.. ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నాడు మెగా పవర్ స్టార్. తన హ్యాండ్సమ్ లుక్స్ .. స్టైల్, అవుట్ ఫిట్స్, యాటీట్యూడ్ తో అందరిని ఆకర్శిస్తున్నాడు చరణ్.
అంతే కాదు బయట అభిమానులు ఎలాగా చరణ్ అంటే పరిచచ్చిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా చరణ్ తన లుక్స్‌తో ప్రతి ఒక్కర్ని తన ఫాలోవర్స్ గా మార్చుకున్నారు. రామ్ చరణ్ తన చార్మ్‌నెస్‌తో అమ్మాయిలకు డ్రీం బాయ్, అబ్బాయిలకు యూత్ ఐకాన్ గా మారిపోయారు. గతంలో మనం చూసిన రామ్ చరణ్ ఇతనేనా అనేవిధంగా తనలో మార్పులు చేసుకున్నాడు చెర్రి. అందుకే ఎప్పటికప్పుడు తన ఫాలోవర్లస సంఖ్య పెరుగుతోంది. ఇక ఆర్ఆర్ఆర్ లో చరణ్ లుక్స్ తో పాటు.. అద్భుతమైన నటన అందరిని తనపైపు తిప్పుకుంది. ఇక ఇఫ్పుడు ఫాలోయింగ్ విషయంలో రేర్ రికార్డ్ అందుకున్నాడు చరణ్. ఈ విషయంలో అల్లు అర్జున్, విజయ్ దేవరకోండ పేరిట ఉన్న రికార్డ్ ను చెరిపేశాడు.

చరణ్ కి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ పెరుగుతుంది. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కౌంట్ కూడా రోజురోజుకి పెరుగుతూ పోతుంది. మిలియన్స్ మార్క్ ను చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా క్రాస్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. తాజాగా మెగాపవర్ స్టార్ 20 మిలియన్ మార్క్ ని క్రాస్ చేశారు. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ అంతా.. రామ్ చరణ 20 మిలియన్ మార్క్ ఫాలోవర్స్ ను చాలా ఫాస్ట్‌గా చేరుకున్న సౌత్ ఇండియన్ యాక్టర్ గా రికార్డు సృష్టించారు. అయితే ఈ రికార్డ్ గతంలో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండల పేరిట ఉంది. అది అసలు విషయం.
ఇక ఈ 20మిలియన్ మార్క్ ని రామ్ చరణ్ 1635 రోజుల్లో చేరుకున్నారు.కాగా రామ్ చరణ్ కంటే ముందు ఈ మార్క్‌ని అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ అందుకున్నారు. అల్లు అర్జున్ కు ఈ మార్క్ ను అందుకోవడం కోసం 1925 రోజులు పట్టింది. అదే రౌడీహీరో విజయ్ దేవరకొండకి 2050 రోజులు పట్టగా రామ్ చరణ్ వీళ్లిద్దరికంటే ముందు ఈ రికార్డ్ సాధించాడు. కాని సౌత్ లో ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న హీరోల్లో అల్లు అర్జున్ 24.2M ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో ఉంటే, నెక్స్ట్ ప్లేసులో విజయ్ దేవరకొండ 20.7M ఫాలోవర్స్ తో ఉన్నారు.
ఇక త్వరలో రామ్ చరణ్ ఫాలోవర్స్ పరంగా బన్నీని , విజయ్ ని క్రాస్ చేసే అవకాశం లేకపోలేదు. ఇక ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. ఈమూవీ షూటింగ్ ఇంకా నెలరోజులు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో ఈమూవీకి గుమ్మడి కాయ కొట్టబోతున్నారట. ఇక ఈసినిమా షూటింగ్ అయిపోగానే.. మార్చ్ లో..బుచ్చిబాబు సినిమాలో జాయిన్ కాబోతున్నాడట చరణ్.
