చరణ్ సినిమాకు రీషూట్లు!

First Published 9, May 2018, 5:03 PM IST
ram charan boyapati film goes for a reshoot
Highlights

రామ్ చరణ్ కు కాంబినేషన్ సీన్స్ సంతృప్తినివ్వకపోవడంతో రీషూట్ చేద్దామని బోయపాటిని అడిగినట్లు తెలుస్తోంది

ఇటీవల 'రంగస్థలం' చిత్రంతో సక్సెస్ అందుకున్న హీరో రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ రెండు షెడ్యూల్స్ లో చరణ్ పాల్గొంది లేదు. రీసెంట్ గా సినిమా కొత్త షెడ్యూల్ లో జాయిన్ అయ్యాడు చరణ్. స్నేహ, ప్రశాంత్, కియారా అద్వానీ కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అలానే భారీయాక్షన్ ఎపిసోడ్ ను కూడా షూట్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు మరోసారి ఆ సీన్స్ ను రీషూట్ చేయనున్నట్లు సమాచారం. రామ్ చరణ్ కు కాంబినేషన్ సీన్స్ సంతృప్తినివ్వకపోవడంతో రీషూట్ చేద్దామని బోయపాటిని అడిగినట్లు తెలుస్తోంది. దానికి ఆయన కూడా ఓకే చెప్పడంతో త్వరలోనే ఈ సన్నివేశాలను మరోసారి చిత్రీకరించనున్నారు. అయితే మరో మూడు రోజుల్లో చిత్రబృందం షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్ళబోతుంది. అక్కడ రెండు వారల పాటు షూటింగ్ నిర్వహించనున్నారు. 

ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత మిగిలిన నటీనటుల కాల్షీట్ల ప్రకారం రీషూట్ చేసే ఛాన్స్ ఉంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నారు. 

loader