Asianet News TeluguAsianet News Telugu

‘ఆచార్య’: రామ్‌ చరణ్‌ చెప్పిన మాటలకు గూస్‌బమ్స్ వచ్చాయి

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. ఇక ఈ సినిమాలోరామ్ చరణ్ కూడా ఓ ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేస్తున్నారు. న‌క్స‌లైట్ పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ  నేప‌థ్యంలో ఈ రోజు చరణ్ ఆచార్య సెట్‌లో అడుగుపెట్టాడు. దర్శకుడు కొరటాలతో కలిసి టీ తాగుతూ అందరికి పలకరించాడు. ఈ సందర్భంగా ఆర్ట్‌ డైరెక్టర్‌ సెల్వరాజన్ వేసిన సెట్‌పై రామ్‌ చరణ్‌ ప్రశంసలు కురిపించారు. 
 

Ram Charan bowled over by Suresh work jsp
Author
HYDERABAD, First Published Dec 27, 2020, 1:38 PM IST

చిరు హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో  కాజల్‌ హీరోయిన్. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కరోనా వల్ల కొన్ని నెలల పాటు బ్రేక్ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ షూటింగ్ మొదలైపోయింది.  రెగ్యులర్ షూట్ జరుగుతోంది. చిరంజీవి లేకుండా కొన్ని సీన్స్ ప్లాన్ చేసి తీసారు శివ. ఇప్పుడు చిరు సైతం ఈ సినిమా షూటింగ్ కు హాజరవుతున్నారు.  

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. ఇక ఈ సినిమాలోరామ్ చరణ్ కూడా ఓ ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేస్తున్నారు. న‌క్స‌లైట్ పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ  నేప‌థ్యంలో ఈ రోజు చరణ్ ఆచార్య సెట్‌లో అడుగుపెట్టాడు. దర్శకుడు కొరటాలతో కలిసి టీ తాగుతూ అందరికి పలకరించాడు. ఈ సందర్భంగా ఆర్ట్‌ డైరెక్టర్‌ సెల్వరాజన్ వేసిన సెట్‌పై రామ్‌ చరణ్‌ ప్రశంసలు కురిపించారు. 

ఈ విషయాన్ని  స్వయంగా సోషల్ మీడియా తెలిపిన సెల్వరాజన్‌.. చరణ్‌తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ 'సెట్‌లో మీరు చెప్పిన మాటలకు గూస్‌బమ్స్ వచ్చాయి సర్. మీ ప్రశంసలను ఎప్పటికీ మర్చిపోలేను. అవి నా పనిలో శ్రద్ధను మరింతగా పెంచాయి. మీ విలువైన మాటలకు ధన్యవాదాలు సార్' అంటూ రాసుకొచ్చాడు. 

ఇక రామ్ చరణ్ ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నట్టు ఇప్పటికే కొరటాల శివ స్పష్టం చేసారు. పాత్ర నిడివి ఏంతనేది తెలియలేదు కానీ సినిమాలో చాలా సేపు ఉంటుందని మాత్రం చెప్తున్నారు. మరో ప్రక్క రామ్ చరణ్‌కు జోడీగా నటించబోయేది ఎవరన్నది మాత్రం చిత్ర టీమ్  ఇంకా స్పష్టం చేయలేదు. గతంలో కన్నడ భామ రష్మిక, సమంత, సాయిపల్లవి ఇలా.. కొన్ని పేర్లు వినిపిస్తూ వచ్చాయి. అయితే.. చిత్ర టీమ్ మాత్రం బాలీవుడ్‌వైపు మొగ్గు చూపించిందట. చరణ్‌కు జోడీగా ఓ బాలీవుడ్‌ భామను తీసుకొస్తే బాగుంటుందని భావిస్తోందని తెలుస్తోంది. అంతేకాదు.. ఇప్పటికే కొంతమంది హీరోయిన్లతో ఓ లిస్టు తయారు చేసి.. చివరికి కియారా అడ్వాణీని ఎంపిక చేసినట్లు సమాచారం.

రామ్ చరణ్ మాట్లాడుతూ...‘స్టార్‌డమ్‌, ప్రేక్షకుల అభిమానం.. ఇవన్నీ మా నాన్న వల్ల నాకు వచ్చినవే. అలాంటి ఆయనతో కలిసి వెండితెరను పంచుకోవడం నా అదృష్టం. 2015లో నేను నటించిన ‘బ్రూస్‌లీ’ చిత్రంలో నాన్న ప్రత్యేక పాత్రలో నటించారు. అదేవిధంగా ‘ఖైదీ నెంబర్‌ 150’లోని పాటలో నేను నాన్నతో కలిసి స్టెప్పులేశా. ఇప్పుడు ‘ఆచార్య’లో మళ్లీ కలిసి తెరపై కనిపిస్తాం’ అని ఆయన చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios