మెగాస్టార్‌ చిరంజీవి సతీమణి, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తల్లి సురేఖ పుట్టిన రోజు గురువారం జరిగింది. ఇంట్లో సింపుల్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. అయితే ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ పంచుకున్న ఫోటో, ఆయన చెప్పిన ఎమోషనల్‌ విషెస్‌ హైలైట్‌గా మారాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తల్లి సురేఖకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు రామ్‌చరణ్‌. నీ అమితమైన ప్రేమకు కృతజ్ఞతలు. అమ్మ నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు` అని ట్వీట్‌ చేశారు. మరోవైపు `నా మొదటి ప్రేమకి బర్త్ డే విషెస్‌. లవ్‌ యూ అమ్మ` అని పేర్కొన్నాడు చరణ్‌. ఈ సందర్భంగా అమ్మతో కలిసి దిగిన ఫోటోని పంచుకున్నాడు. 

ప్రస్తుతం ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మెగా ఫ్యామిలీ అంతా సురేఖకి బర్త్ డే విషెస్‌ చెబుతున్నారు. ఖుషీ అవుతున్నారు. రానా వంటి పలువురు సెలబ్రిటీలు కూడా సురేఖకి బర్త్ డే విషెస్‌ తెలియజేశారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ `ఆచార్య`లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. అక్టోబర్‌ 13న సినిమా విడుదల కానుంది. దీంతోపాటు శంకర్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.