Asianet News TeluguAsianet News Telugu

Ram Charan:చరణ్ ని 'అన్న' అని పిలిచిన బాలీవుడ్ సీనియర్ స్టార్

ఈ ట్వీట్ కు అక్షయ్ కుమార్ రిప్లయి ట్వీట్ ఇచ్చాడు. థాంక్యూ సో..మచ్ ..రామ్ చరణ్ అన్న అని ట్వీట్ చేశాడు. రామ్ చరణ్ ను అలా ‘అన్న’ అని సంబోధించడం చూసి మెగా ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే సరదాగానే అక్షయ్ కుమార్ అలా రామ్ చరణ్  కు  రిప్లై ఇచ్చారు.  

Ram Charan Becomes Anna For Akshay Kumar!
Author
Mumbai, First Published Jun 29, 2022, 12:01 PM IST


తన కన్నా పెద్ద వయస్సు వారిని లేక అనుభవంలో గొప్పవారిని అన్న అని సంభోదిస్తూంటారు. కానీ రామ్ చరణ్ ని ఓ సీనియర్ బాలీవుడ్ సూపర్ స్టార్ అన్న అని పిలిచారు. ఇప్పుడు అది బాలీవుడ్, టాలీవుడ్ సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎవరా సీనియర్ ...ఎందుకు అలా పిలిచారు అంటే...

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన ‘రక్షా బంధన్’.. అన్నా చెల్లెళ్ల అనుబంధంపైన తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ఈ ఫిల్మ్ ట్రైలర్ చూసిన రామ్ చరణ్..అక్షయ్ కుమార్ సర్ ..ట్రైలర్ బ్యూటిఫుల్ గా ఉందని ట్వీట్ చేశాడు. ఈ క్రమంలోనే చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ ట్వీట్ కు అక్షయ్ కుమార్ రిప్లయి ట్వీట్ ఇచ్చాడు. థాంక్యూ సో..మచ్ ..రామ్ చరణ్ అన్న అని ట్వీట్ చేశాడు. రామ్ చరణ్ ను అలా ‘అన్న’ అని సంబోధించడం చూసి మెగా ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే సరదాగానే అక్షయ్ కుమార్ అలా రామ్ చరణ్ రిప్లై ఇచ్చారు. ఎందుకంటే అక్షయ్ కుమార్ చిత్రం పూర్తిగా అన్న చెల్లెళ్లు అనుబంధంపై ఆధారపడి నడుస్తుంది. 

ఇక ఈ ట్రైలర్‌లో మాత్రం అక్షయ్ కుమార్ అందరినీ మెప్పించేస్తాడు. నలుగురు చెల్లెళ్లు, వారికి పెళ్లి చేస్తేనే గానీ తాను పెళ్లి చేసుకోలేడు.. చిన్ననాటి నుంచి ఓ ప్రేయసి ఉంటుంది.. కానీ పెళ్లి చేసుకోలేడు.. చెల్లెళ్లకి పెళ్లి చేసిన తరువాతే తాను చేసుకోవాలి. తన నలుగురు చెల్లెళ్లకి పెళ్లి చేసేందుకు పడ్డ తంటాలను ఎంతో వినోదాత్మకంగా చూపించేశాడు. కట్నం సమస్యలు, ఆడ పిల్లల సమస్యలను ఎంతో హృద్యంగా చూపించాడు.

ఇక చివర్లో తన చెల్లి పెళ్లిని చేసేందుకు రెడీ అవుతాడు. నా పెళ్లికి ఇంత డబ్బు ఎలా వచ్చింది? అన్నయ్య అని అడుగుతుంది. షాప్ అమ్మేశాను అని అన్న అంటే.. మరి మిగతా వాళ్ల పెళ్లిళ్లు ఎలా అన్నయ్య అని అడుగుతుంది. రెండు కిడ్నీలున్నాయ్ కదా? అంటూ సరదాగా చెప్పడంతో ట్రైలర్ ముగుస్తుంది. మొత్తానికి ఈ ట్రైలర్ మాత్రం అందరికీ ఎమోషనల్ ఫన్ రైడ్‌లా అనిపిస్తుంది. ఈ చిత్రం ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకుడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios