ముద్దుల కూతురు క్లీంకారతో రాంచరణ్, ఉపాసన ఫస్ట్ ఫారెన్ టూర్.. బ్యూటిఫుల్ క్లిక్స్ వైరల్
ఈ ఏడాది జూన్ 20న మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన కొణిదెల దంపతులు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. వివాహం జరిగి పదేళ్ల తర్వాత వీరిద్దరూ సంతానం పొందారు.

ఈ ఏడాది జూన్ 20న మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన కొణిదెల దంపతులు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. వివాహం జరిగి పదేళ్ల తర్వాత వీరిద్దరూ సంతానం పొందారు. తమ ముద్దుల కుమార్తెకి అమ్మవారి పేరు కలసి వచ్చేలా క్లీంకార అని నామకరణం చేశారు.
తమకి కుమార్తె పుట్టిన తర్వాత రాంచరణ్, ఉపాసన మొట్ట మొదటి సరి ఫారెన్ ట్రిప్ కి వెళుతున్నారు. అంటే క్లీంకార ఫస్ట్ ఫారెన్ టూర్ ఇదే అన్నమాట. ఈ మేరకు రాంచరణ్, ఉపాసన విమానాశ్రయంలో కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రాంచరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. చాలా కాలంగా ఈ చిత్రం డిలే అవుతూ వస్తుంది. షూటింగ్ నుంచి విరామం దొరకడంతో చరణ్ తన టైంని ఫ్యామిలీకి కేటాయిస్తున్నారు.
రాంచరణ్ తన పెట్ రైమ్ ని ఎత్తుకుని వెళుతుండగా.. క్లీంకార తల్లి ఉపాసన ఒడిలో ఒదిగిపోయింది. ఈ అందమైన దృశ్యాలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ వీరు వెకేషన్ వెళుతున్నది ఎక్కడికంటే.. అందమైన ఇటలీ దేశానికి. ఇటలీలో తమ కుమార్తెతో చరణ్, ఉపాసన ఎక్కువరోజులు వెకేషన్ లో ఎంజాయ్ చేయనున్నారట. తిరిగి వచ్చిన తర్వాత చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ లో పాల్గొంటాడు.
గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటించాల్సి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.