Asianet News TeluguAsianet News Telugu

తండ్రి కాబోతున్న స్టార్ హీరో రామ్‌చరణ్.. ట్విట్టర్ వేదికగా వెల్లడించిన చిరంజీవి..

ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారు. రామ్‌చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 

ram charan and upasana couple are expecting their first child
Author
First Published Dec 12, 2022, 2:55 PM IST

ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారు. రామ్‌చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘"శ్రీ హనుమాన్ జీ ఆశీస్సులతో రామ్ చరణ్- ఉపాసన తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాం’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. కొణిదెల, కామినేని కుటుంబాల తరపున సంయుక్తంగా ఈ ప్రకటనను విడుదల చేశారు. 

దీంతో వచ్చే ఏడాది మెగా ఫ్యామిలీకి చాలా ప్రత్యేకంగా మారనుంది. ఈ వార్త వారి ఫ్యామిలీ, సన్నిహితుల్లోనే కాకుండా.. మెగా అభిమానుల్లో కూడా ఆనందం నింపిందనే చెప్పాలి. చాలా కాలంగా రామ్‌చరణ్- ఉపాసన దంపతులు ఎప్పుడూ తల్లిదండ్రులు అవ్వబోతున్నారనే చర్చ సోషల్ మీడియాలో సాగుతున్న సంగతి  తెలిసిందే. 

 

రామచరణ్, ఉపాసనలు ప్రేమించి, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2011 డిసెంబర్‌లో నిశ్చితార్థం జరగగా..  2012 జూన్ 14న రామచరణ్, ఉపాసన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ ఏడాది రామ్‌చరణ్, ఉపాసన దంపతులు వారి 10వ వివాహ వార్షికోత్సవాన్ని ఇటలీలో జరుపుకున్నారు.  

ఇక, రామ్‌చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన శంకర్‌ దర్శకత్వంలో పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు.  ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ యాభైశాతం పూర్తయింది. ఈ ప్రాజెక్ట్‌ అనంతరం ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్‌చరణ్ సినిమా ఉండనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios