దర్శకధీరుడు రాజమౌళి నేడు తన 48వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. బాహుబలి చిత్రంతో రాజమౌళి యావత్ దేశం తో పాటు ప్రపంచ సినీ ప్రియులని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

దర్శకధీరుడు రాజమౌళి నేడు తన 48వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. బాహుబలి చిత్రంతో రాజమౌళి యావత్ దేశం తో పాటు ప్రపంచ సినీ ప్రియులని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఒక ఇండియన్ సినిమా నుంచి ఎవరూ ఇలాంటి విజువల్ ఫీస్ట్ ఊహించి ఉండరు. అది రాజమౌళికి మాత్రమే సాధ్యం అయింది. 

నేడు జక్కన్న పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ సెలెబ్రిటీలు రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ Rajamouliకి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. 

'హ్యాపీ బర్త్ డే డియర్ జక్కన్న' అంటూ ఎన్టీఆర్ విష్ చేశాడు. రాజమౌళితో ఉన్న మెమొరబుల్ పిక్ షేర్ చేశాడు. 

Scroll to load tweet…

'ఆయనలోని సింప్లిసిటీ, బలం చాలా విధాలుగా అభిమానించేలా చేసింది. హ్యాపీ బర్త్ డే రాజమౌళి గారు' అంటూ రాంచరణ్ ట్వీట్ చేశాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరిగా పోలీస్ గెటప్ లో ఉన్న పిక్ ని రాంచరణ్ ఈ సందర్భంగా షేర్ చేశాడు. ఈ పిక్ లో చరణ్, రాజమౌళి ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తున్నారు. 

Scroll to load tweet…

' మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రాజమౌళి గారు. మీతో కలసి పనిచేయడం మెమొరబుల్ ఎక్స్పీరియన్స్' అని అజయ్ దేవగన్ జక్కన్నకు విషెస్ తెలిపాడు. అజయ్ దేవగన్ ఆర్ఆర్ఆర్ లో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Scroll to load tweet…

ఎన్నో వాయిదాల తర్వాత RRR చిత్రాన్ని ఈ సంక్రాంతి కానుకగా జనవరి 7, 2022న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

అల్లూరి, కొమరం భీం ఇద్దరూ స్నేహితులు అయితే ఎలా ఉంటుంది అనే కల్పిత ఆలోచన నుంచి ఆర్ఆర్ఆర్ కథ పుట్టింది. బ్రిటిష్ బ్యాక్ డ్రాప్ లో కళ్ళు చెదిరే యాక్షన్ చిత్రంగా ఆర్ఆర్ఆర్ ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. రాంచరణ్ కి జోడిగా అలియా భట్, ఎన్టీఆర్ కి జోడిగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు.