ఇక రంగంలోకి దిగబోతున్నాడు రామ్ చరణ్. నాన్ స్టాప్ గా సినిమాలు కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా.. రంగంలోకి దిగబోతున్నాడు మెగా పవర్ స్టార్.
ప్రస్తుతం కూతురు పుట్టిన ఆనందంలో ఉన్నాడు రామ్ చరణ్. ప్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. అదే జోరుతో షూటింగ్స్ స్టార్ట్ చేయాలని పట్టుదలతో ఉన్నాడు రామ్ చరణ్. అందుకే శంకర్ డైరెక్షన్ లో చేస్తోన్న గేమ్ చేంజర్ పెండింగ్ షూటింగ్ తో పాటు.. బుచ్చిబాబు సానతో ఫిక్స్ అయిన కొత్త సినిమాను సెట్స్ ఎక్కించడానికి రెడీ అవుతున్నాడు. దాదాపు ఈ సెప్టెంబర్ నుంచి బుచ్చిబాబు సినిమాతో బిజీ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలైపోయింది. ఇక షూటింగ్ స్టార్ట్ చేసుకోవడమే తరువాత.
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రామ్ చరణ్ మూవీని తెరకెక్కింయబోతున్నాడు బుచ్చిబాబు.రామ్ చరణ్ ప్రస్తుతం పర్సనల్ టైం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే రామ్ చరణ్ తన ఫ్యామిలీకోసం తీసుకున్న టైమ్ ను అటు శంకర్ బాగా వాడుకుంటున్నాడు ప్రస్తుతం దొరికిన గ్యాప్‌లో ఇండియన్ 2 పూర్తి చేస్తున్నాడు. రామ్ చరణ్ మళ్లీ షూటింగ్‌కు వచ్చేలోపు కమల్ సినిమా పూర్తి చేయాలనిపట్టుదలతో ఉన్నాడు శంకర్. అనుకున్నట్టుగానే దాదాపుగా ఇండియన్2 మూవీ షూటింగ్ అయిపోయినట్ట తెలుస్తోంది.
ఇక రామ్ చరణ్ ఆగస్ట్ సెకండ్ వీక్ నుంచి షూటింగ్స్ కు వచ్చే అవకాశం ఉండటంతో.. గేమ్ చేంజర్ చిత్ర షూటింగ్ ఆగస్టు నుంచి రీస్టార్ట్ చేసి నవంబర్ లోపు పూర్తి చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక డిసెంబర్ నుంచి బుచ్చిబాబు సినిమా స్టార్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట టీమ్. ఒక వేళ కుదిరితే సెప్టంబర్ లోనే ఈమూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయిపీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే స్పోర్ట్స్ డ్రామాగా బుచ్చిబాబు సినిమా వస్తుంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలుస్తోంది. స్వాతంత్రానికి పూర్వం జరిగే కథతో ఈ సినిమా రాబోతుంది. దీనికి పెద్ది అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా ఇది. రంగస్థలం సినిమాను మించిన రూరల్ కథతో ఈ సినిమా రాబోతుంది. అటు గేమ్ చేంజర్ లో కూడా చరణ్ రెండు పాత్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్ తో సినిమా చేయాలని చాలా కాలం వెయిట్ చేశాడు బుచ్చిబాబు.. కాని అది వర్కౌట్ అవ్వకపోవడంతో.. రామ్ చరణ్ ను తన కథతో ఇంప్రెస్ చేశాడు. ఇక ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి 2024 దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
