మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి.  స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాని మెగా పవర్‌ రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా  తెరకెక్కిస్తున్నారు. 

భారీగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోవాలంటే సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండాలి..మెగా ప్యాన్స్ కు పండుగ చేసుకునేలా ఉండాలి. ఇవన్నీ ఆలోచించే  ఈ సినిమాలో రకరకాల సర్పైజ్ లు దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో అల్లు అర్జున్, రామ్ చరణ్ ఓ సీన్ లో అలా వచ్చి కనిపించి వెళ్తారు.

సెకండాఫ్ లో ఆ సీన్ రానుంది. అలాగే ఫస్టాఫ్ లో మరో సర్పైజ్ ఉందని తెలుస్తోంది. అనుష్క సైతం ఓ చిన్న పాత్రలో కనిపించి అలరించనుందని చెప్తున్నారు. అయితే రిలీజ్ అయ్యేదాకా వాటిని దాచి పెట్టాలని టీమ్ భావిస్తోందిట. విడుదల అనంతరం జనం గెస్ట్ రోల్స్  గురించి మాట్లాడుకుంటే బజ్ క్రియేట్ అవుతుందని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. 

ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా 2019 సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో రిలీజ్‌ కురెడీ అవుతున్న ఈ మూవీ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోంది.  సైరా నరసింహారెడ్డి సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. జగపతిబాబు, తమన్నా, సుధీప్‌, తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు.