'సై రా' ఒక్క షెడ్యూల్ కి ఎంత ఖర్చో తెలుసా..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 11, Sep 2018, 1:55 PM IST
ram charan allotts Rs 50 Crores for Georgia Schedule of Sye raa
Highlights

బాహుబలి సినిమా తరువాత తెలుగులో మరో భారీ బడ్జెట్ సినిమా వస్తోంది. అదే 'సై రా' నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాను దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని సమాచారం.

బాహుబలి సినిమా తరువాత తెలుగులో మరో భారీ బడ్జెట్ సినిమా వస్తోంది. అదే 'సై రా' నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాను దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. అయితే ఒక షెడ్యూల్ కోసం ఏకంగా రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం.

రూ.50 కోట్లంటే స్టార్ హీరోతో సినిమా చేసేయొచ్చు. అలాంటిది 'సై రా' ఒక షెడ్యూల్ కోసం ఇంత మొత్తాన్ని ఖర్చు చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చారిత్రక నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ జార్జియాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రబృందం జార్జియాకి బయలుదేరింది. అక్కడ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

సహజత్వం కోసం అంత దూరం వెళ్లి షూట్ చేయబోతున్నారు. అయితే ఈ ఒక్క షెడ్యూల్ కోసం రామ్ చర్మం యాభై కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని దర్శకుడు సురేందర్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. ఖర్చు కోసం చూసుకోకుండా క్వాలిటీ అవుట్ పుట్ రావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి.. 

'సై రా'పై నిషేధం పడనుందా..?

loader