యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యువి క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన విఎపిక్ మల్టిప్లెక్స్ థియేటర్ హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట పట్టణంలో ఈ థియేటర్ ని నిర్మించారు. ఆసియాలోని అతి పెద్ద స్క్రీన్స్ లో ఒకటిగా నిర్మించిన విఎపిక్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

మెగా పవర్ స్టార్ రాంచరణ్ గురువారం రోజు ఈ థియేటర్ లాంచ్ కు హాజరయ్యారు. చరణ్ చేతుల మీదిగా థియేటర్ ప్రారంభమైంది. కాసేపు థియేటర్ లో సాహో, సైరా చిత్రాల టీజర్, ట్రైలర్స్ ని ప్రదర్శించారు. థియేటర్ లో ఈ రెండు భారీ చిత్రాల ట్రైలర్స్ చూడడం గొప్ప అనుభూతి నిచ్చిందని చరణ్ తెలిపాడు. సినిమానే చూసిన అనుభూతి కలిగిందని చరణ్ తెలిపాడు. 

దాదాపు 100 అడుగుల ఎత్తు ఉండే స్క్రీన్ అత్యాధునిక హంగులతో సౌండ్ సిస్టం ఇలా ప్రతి అంశంలో ఏఈ థియేటర్ ప్రేక్షకులని ఆకర్షిస్తోంది. ఇందులో మొత్తం మూడు స్క్రీన్స్ ఉంటాయి. 

ఈ థియేటర్ ప్రదర్శించబోయే తొలి చిత్రం సాహో. ఈ సందర్భంగా రాంచరణ్ ప్రభాస్ కు, సాహో చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపాడు. సాహో దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఫస్ట్ మూవీ రన్ రాజా రన్ నేను చూశా. ఇక సాహోలో ప్రభాస్ ని ఎలా చూపించి ఉంటాడో నాకు తెలుసు అని రాంచరణ్ తెలిపాడు. ఇలాంటి థియేటర్ ఆంధ్రప్రదేశ్ లో ఉండడం గర్వకారణం అని అన్నాడు. సైరా చిత్రం కోసం మరోసారి ఈ థియేటర్ కు వస్తానని రాంచరణ్ అభిమానులతో అన్నాడు.