నిన్ను చూస్తే ఈర్ష్యగా ఉందన్నారు.. మెగాస్టార్ స్టార్ పై చరణ్ వ్యాఖ్యలు!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 21, Aug 2018, 3:39 PM IST
ram charan about sye ra narasimhareddy movie
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సై రా నరసింహారెడ్డి' సినిమా టీజర్ విడుదల కార్యక్రమం ఈరోజు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సై రా నరసింహారెడ్డి' సినిమా టీజర్ విడుదల కార్యక్రమం ఈరోజు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు రామ్ చరణ్ తో పాటు అతడి తల్లి సురేఖ అలానే నానమ్మ అంజనా దేవి కూడా హాజరయ్యారు. తన కొడుకు నటించిన 'సై రా' టీజర్ అదిరిపోయిందని అంజనా దేవి అన్నారు. అనంతరం రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''12 ఏళ్లుగా ఈ సినిమా చేయాలని పరుచూరి బ్రదర్స్ నాన్నగారితో ఈ సినిమా చేయాలనుకున్నారు.

ఇంటికి వచ్చిన ప్రతిసారి ఆయనకి ఈ సినిమా గురించి చెప్పమని అనేవారు. వారి పన్నెండేళ్ల సంకల్పం ఈ సినిమా. ఇంత బడ్జెట్ లో సినిమా తీస్తున్నామని ఇప్పుడే నంబర్స్ రివీల్ చేయాలనుకోవడం లేదు. భారీ బడ్జెట్ తో అయితే సినిమా తీస్తున్నాం. నాన్న గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి దేనికి వెనుకాడకుండా సినిమా నిర్మిస్తున్నాం. దీనిపై మేము ఎలాంటి లాభాలు ఆశించడం లేదు. వస్తే అది బోనసే అవుతుంది.

నాన్నగారు నాతో ఒక మాట అన్నారు. నిన్ను చూస్తే నాకు చాలా ఈర్ష్యగా ఉంది. రెండో సినిమాకే మంచి సోషియో ఫాంటసీ, కాస్ట్యూమ్ డ్రామా సినిమా చేసావు. నేను ముప్పై ఏళ్లలో 150 సినిమాలు చేశాను కానీ ఒక్క కాస్ట్యూమ్ డ్రామా కూడా రాలేదని'' అన్నారు. అందుకే ఈ సినిమా విషయంలో ప్రాఫిట్స్ గురించి ఆలోచించకూడదని ముందే అనుకున్నాం.

ఇవి కూడా చదవండి..   

'ఈ సినిమా ఎవరిదీ?'.. 'సైరా' టీజర్ పై కామెంట్స్!

సైరా నరసింహారెడ్డి టీజర్ లాంఛ్ గ్యాలరీ

'ఈ యుద్ధం ఎవరిదీ..' అంచనాలు పెంచేసిన 'సై రా' టీజర్!

loader