టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్షన్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ  మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమా అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డులు క్రియేట్ చేస్తోంది. అసలు విషయానికి వస్తే హీరో రామ్ చరణ్ మెగాస్టార్ హిట్టు సినిమాలకు సంబందించిన సీక్వెల్స్ పై వివరణ ఇచ్చాడు. 

అసలైతే వినయవిధేయ రామ గ్యాంగ్ లీడర్ సీక్వెల్ అంటూ ముందు టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. దానితో పాటు మెగాస్టార్ సినిమా ప్రీ రిలీజ్ లో ఆ సినిమాను గుర్తు చేసుకోవడంతో అదే తరహాలో సినిమా ఉంటుందేమో అనే టాక్ వైరల్ అయ్యింది. దీంతో చరణ్ అవన్నీ అపోహలే అని చెబుతూ సినిమా చుస్తే సరికొత్త ఫీలింగ్ కలుగుతుందని చెప్పాడు. 

అంతే కాకుండా గ్యాంగ్ లీడర్ కు సీక్వెల్ చేయడం తనకు ఇష్టమే అని చెబుతూ మంచి స్క్రిప్ట్ తో వస్తే తప్పకుండా నటిస్తాను అని మెగా పవర్ స్టార్ వివరణ ఇచ్చాడు. 1991లో వచ్చిన గ్యాంగ్ లీడర్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. మరి చరణ్ ఆ సినిమాకు సీక్వెల్ చేస్తాడో లేదో కాలమే నిర్ణయించాలి.