ప్రస్తుతం మైసూర్ లో సందడి చేస్తున్నారు రామ్ , బోయపాటి టీమ్. అందమైన లొకేషన్లలో.. అద్భుతమైన సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. 

ఇస్మార్ట్ శంర్ సినిమాతో.. తాను అనుకున్న మాస్ ఇమేజ్ తో పాటు.. హిట్ కూడా సాధించాడు రామ్ పోతినేని. కాని ఆతరువాతే అతనికి టైమ్ కలిసి రాలేదు. రామ్ హిట్ అనే మాట విని చాలాకాలమైంది. అందుకే ఈసారి సాలిడ్ హిట్ కొట్టాలి. అదికూడా మాస్ హిట్ కొట్టాలి అని డైసైడ్ అయ్యాడు రామ్. అందుకే ఊరమాస్ సినిమాలకు కేరాఫ్అడ్రస్ గా నిలిచిన బోయపాటి శ్రీనుతో కలిశాడు. ఈ ఇద్దరు కలిసి అదరిపోయే సినిమాను ప్లాన్ చేసుకున్నారు. ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ గా సాగుతోంది. 

 భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక ఈమూవీ షూటింగ్ దాదాపు అయిపోయినట్టే తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ దృశ్యాలను రీసెంట్ గా షూట్ చేశారు. బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ ను దాదాపు గా 24 రోజులు షూటింగ్ చేసినట్టు సమాచారం. ఇక ఇప్పుడు ఈసినిమాకు సంబంధించిన గ్లామర్ పార్ట్ షూటింగ్ జరుగుతుంది. ముఖ్యంగా బ్కూటిఫుల్ లొకేషన్స్ లో .. సాంగ్ షూట్ జరుగుతున్నట్టు సమాచారం. 

ఈ సినిమాకి సంబంధించిన ఒక పాటను చిత్రీకరించడానికి టీమ్ అంతా మైసూర్ చేరుకుంది. రామ్ - శ్రీలీలపై ఈ పాటను చిత్రీకరించనున్నారు.ఈ నెల 15వ తేదీ వరకూ ఈ పాటకు సబంధించిన షూటింగ్ జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ తండ్రి పాత్రని బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ పోషించనున్నాడని అంటున్నారు. థమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో దసరాకి విడుదల చేయనున్నారు.