రవితేజ, రామ్ తో మల్టీస్టారర్!?

ఇద్దరు హీరోలు అయితే ఇద్దరు హీరోల అభిమానులు ఈ సినిమా చూడడంతో పాటు వీరిద్దరి మల్టీస్టారర్ కోసం ఎదురుచూస్తారు. ఈ క్రమంలోనే త్వరలో రామ్, రవితేజ కాంబినేషన్ లో ఓ మల్టిస్టారర్ కు ప్లానింగ్ జరుగుతున్నట్లు సమాచారం.

Ram and Ravi Teja Multi Starrer With anil Ravipudi jsp

తెలుగులో మల్టీస్టారర్ సినిమాల హవా ఎక్కువైంది. మల్టీస్టారర్ సినిమాలు హిట్ అవుతూండటంతో.. దర్శక నిర్మాతలు కూడా ఆ  తరహా సినిమాలు చేసేందుకు ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు. ఒక హీరోతో సినిమా తీయడం కంటే ఇద్దరు హీరోలను పెట్టి సినిమా తీస్తే సినిమాకు కమర్షియల్ గా మరింత ప్లస్ పాయింట్ అవుతుందని దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఒక హీరోతో అయితే ఆ హీరో అభిమానులు మాత్రమే సినిమా చూస్తారు. అదే ఇద్దరు హీరోలు అయితే ఇద్దరు హీరోల అభిమానులు ఈ సినిమా చూడడంతో పాటు వీరిద్దరి మల్టీస్టారర్ కోసం ఎదురుచూస్తారు. ఈ క్రమంలోనే త్వరలో రామ్, రవితేజ కాంబినేషన్ లో ఓ మల్టిస్టారర్ కు ప్లానింగ్ జరుగుతున్నట్లు సమాచారం.

ఈ కాంబోని ప్లాన్ చేస్తున్నది మరెవరో కాదు అనీల్ రావిపూడి.  ఇప్పటి వరకూ ఫ్లాఫ్ ఎరుగని దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. వరుస హిట్స్ తీస్తున్న అనిల్ ప్రస్తుతం తన 'ఎఫ్‌2'కి సీక్వెల్ గా వెంకటేశ్, వరుణ్‌ తోనే 'ఎఫ్‌3' తెరకెక్కిస్తున్నాడు. తనదైన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ను నాన్ స్టాప్ గా అలరిస్తూ వస్తున్న అనిల్ రావిపూడి మరో మల్టీస్టారర్ కి సన్నాహాలు చేస్తున్నాడట. ఈ మల్టీ స్టారర్ లో రవితేజ, రామ్ నటించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని అంటున్నారు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించే అవకాసం ఉంది.  వీరిద్దరూ కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తే ఆ సినిమా స్టోరీ ఎలా ఉంటుంది... వీరి పాత్రలు ఎలా ఉంటాయి అన్నది అభిమానుల్లో అప్పుడే డిస్కషన్ మొదలైపోయింది.

డైరక్టర్ అనీల్ రావిపుడి కు ఇటు రామ్ తోనూ, అటు రవితేజతోనూ మంచి రిలేషన్ ఉంది. దాంతో వారిద్దరు కలిసి పనిచేయటానికి తమకు ఏ ఇబ్బంది లేదని తేల్చి చెప్పారట. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ మీదకు వెళుతుందట. కామెడీకి కమర్షియాలిటీని జోడించి హిట్స్ ఇస్తున్న అనిల్ గత ఏడాది మహేశ్ తో 'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. రాబోయే 'ఎఫ్3' పైన కూడా మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios