తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన నటుడు రాళ్ళపల్లి కన్నుమూసిన సంగతి తెలిసిందే. రాళ్ళపల్లిగా ఆయన సినీ అభిమానుల గుండెల్ల స్థానం సంపాదించుకున్నారు.

అయితే ఆయన అసలు పేరు రాళ్ళపల్లి వెంకట నరసింహారావు. అయితే రాళ్ళపల్లి అనే పేరే స్థిరపడిపోవడానికి కారణం దర్శకుడు బాపు అని తెలుస్తోంది. ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపారు. సినీ జీవితం ప్రారంభమైన కొత్తలో ఆర్వీ నరసింహారావు పేరు టైటిల్స్ లో వచ్చేది.

ఇంతపెద్ద పేరు ఎందుకు.. రాళ్ళపల్లి అని రాద్దాం అంటూ బాపు చెప్పడంతో అప్పటినుండి రాళ్ళపల్లిగా స్థిరపడిపోయారు. ఇది ఇలా ఉండగా.. దివంగత నందమూరి హరికృష్ణ.. రాళ్ళపల్లిని స్టోన్ విలేజ్ అంటూ ఆట పట్టించేవారట. 

బ్రేకింగ్: టాలీవుడ్ సీనియర్ నటుడు రాళ్ళపల్లి కన్నుమూత

'రాళ్ళపల్లి' మృతికి చిరంజీవి సంతాపం!