సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అందుకే ఉన్నంతలో వీలైనన్ని సినిమాలు చేసి డబ్బు సంపాదించాలని అనుకుంటారు. స్టార్ హీరోయిన్ గా కొనసాగే ఏ హీరోయిన్ కూడా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు సినిమాలను అశ్రద్ధ చేయరు. కానీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తనకు సినిమాల నుండి బ్రేక్ కావాలని అంటోంది. తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గినప్పటికీ కోలీవుడ్, బాలీవుడ్ లో ఆఫర్లు దక్కించుకుంటోంది.

ఈ క్రమంలో ఆమె సినిమాలకు ఎందుకు దూరం కావాలనుకుంటుందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ''నాకు నటించడం అంటే చాలా ఇష్టం. ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తున్నాను. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలను పూర్తి చేసి కొత్త సినిమాలను తగ్గించుకోవాలని అనుకుంటున్నాను. నటిగా కొంతకాలం పాటు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను. ఆ తరువాత మళ్లీ కొత్త ఉత్సాహంతో నటించడానికి రెడీ అవుతాను.

ఈ మధ్యకాలంలో షూటింగ్ కోసం లండన్, ఉక్రెయిన్, ఇండియా ఇలా అన్ని ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నాను. ఇంట్లో వాళ్లతో సమయం గడిపి, ఇంటి ఫుడ్ తిని చాలా రోజులు అయింది. మానసికంగా కూడా నాకు రెస్ట్ కావాలి'' అని వెల్లడించింది.